Sai dharam tej pilla nuvvuleni jeevitham audio release postponed

sai dharam tej latest movies, sai dharam tej rey movie, sai dharam tej pilla nuvvu leni jeevitham movie, sai dharam tej next movie, pilla nuvvuleni jeevitham updates, pilla nuvvuleni jeevitham audio release, pilla nuvvuleni jeevitham release date, mega family heros movies, tollywood latest movies

pilla nuvvuleni jeevitham audio release postponed : mega family hero sai dharam tej movie pilla nuvvu leni jeevitham audio postponed due to cyclone effect as per film unit information this will held on october 25th

తేజును ఈ సారి తుఫాను అడ్డుకుంది

Posted: 10/16/2014 04:14 PM IST
Sai dharam tej pilla nuvvuleni jeevitham audio release postponed

మెగా ఫ్యామిలి నుంచి ప్రేక్షకుల ముందకు వచ్చేందుకు సిద్దంగా ఉన్న హీరో సాయి ధరమ్ తేజ్ తాజా సినిమా ‘పిల్లా నువ్వులేని జీవితం’ సినిమా ఆడియో విడుదల వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం.., ఈనెల 18న ఆడియో విడుదల చేయాలనుకున్నారు. అయితే హుద్ హుద్ తుఫాను విపత్తు వల్ల ప్రజలు కష్టాల్లో ఉండటంతో వేడుకను వాయిదా వేసుకున్నారు. అక్టోబర్ 25న ఆడియో విడుదల చేసేందుకు నిర్ణయించారని తాజాగా సమాచారం వస్తోంది.

ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, హీరోలు రామ్ చరణ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్, వరుణ్ తేజ్ తదితరులు పాల్గొంటున్నారు. పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటారని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం మాత్రం లేదు. ‘పిల్లా నువ్వులేని జీవితం’ మూవీలో రెజినా కెసాండ్రా హీరోయిన్. ఈ సినిమాను రవికుమార్ చౌదరి డైరెక్ట్ చేయగా.., వాసు, హర్షిత్ కలిసి నిర్మిస్తున్నారు. దిల్ రాజు సొంత బ్యానర్ పై సినిమా తెరకెక్కింది. సంగీతం అనూప్ రూబెన్స్ అందించాడు.

సాయి ధరమ్ తేజ్ కు ఇది రెండవ సినిమా అయినా.., విడుదల ప్రకారం తొలి సినిమా అని చెప్పాలి. తొలి సినిమా ‘రేయ్’ పనులన్నీ పూర్తి చేసుకున్నా..,పలు కారణాలతో విడుదల కాలేదు. తాజా సినిమా ద్వారా మెగా ఫ్యామిలి నుంచి వస్తున్న హీరోల సంఖ్య పెరగనుంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sai dharam tej  pilla nuvvuleni jeevitham  audio release  latest updates  

Other Articles