Saif and kareena not interested about children for now

karina kapoor on children, saif ali khan on children, karina and saif ali khan marriage, karishma kapoor children, karina kapoor movies, karina kapoor next movie, saif ali khan next movie, karina and saif movies, randhir kapoor movies, how to become pregnant, pregnant health tips

saif and kareena not interested about children for now : bollywood love couple saif ali khan and karina kapoor leading their family life successfully they not thinking about children for now on this matter karina says that she and saif not wish to become parents immediately they want to spend some time as only couple

దంపతులిద్దరికీ కోరికలు కలగటం లేదట

Posted: 10/16/2014 05:11 PM IST
Saif and kareena not interested about children for now

వివాహం జరిగిన కొద్దికాలానికి అంతా అడిగే సామాన్యమైన ప్రశ్న ఏమిటంటే.., ‘‘ఏమైనా విశేషమా’’. దీనర్ధం గర్భవతి అయ్యారా? అని. పెళ్లి తర్వాత ప్రతి ఒక్కరూ దృష్టిపెట్టేది దీనిపైనే. మామూలుగా అయితే ఏడాది లోపు గర్బవతి కాకపోతే ఏదో లోపం ఉందని నానా పుకార్లు వస్తాయి. అయితే సినిమా స్టార్లకు మాత్రం ఈ కోరికలు తక్కువ. వారు త్వరగా తల్లితండ్రులు అవ్వాలని కోరుకోరు. ప్రేమ పెళ్లి చేసుకున్న సైఫ్-కరీనా దంపతులు కూడా ఇదే చెప్తున్నారు. తమకు ఇప్పట్లో పిల్లలు వద్దు అని ఇద్దరూ నిర్ణయం తీసుకున్నారట.

తారలు ఏం చేసినా విశేషమే. వారి గురించి ప్రతి విషయమూ ఓ వార్తే. పెళ్లి జరిగి రెండు సంవత్సరాలు కావస్తుండటంతో.., విశేషం లేదా అని ఎక్కడికెళ్ళినా మీడియా ప్రశ్నిస్తోందట. కరీనానే కాదు భర్త సైఫ్ కు ప్రశ్నలు తప్పటం లేదు. అటు కరీనా తండ్రి రనధీర్ కపూర్ ను కూడా చిన్నమ్మాయి పిల్లలకు ఎప్పుడు తాతయ్య అవుతారు అని తెగ వేధిస్తున్నారట. దీంతో అందరికి సమాధానం చెప్పాలనే ఉద్దేశ్యంతో కరీనా దగ్గర క్లారిటీ తీసుకున్న తండ్రి.., ‘చిన్న కూతురుకు ఇప్పట్లో పిల్లలను కోరుకోవటం లేదు’ అని చెప్పాడు.

‘ప్రస్తుత తరం పిల్లల విషయంలో ఎవరి సలహాలు తీసుకోవటం లేదు. ఎవరికి వారు నిర్ణయాలు తీసుకుంటున్నారు కాబట్టి వీరి విషయంలో నేను ఏమి చేయలేను అని రణధీర్ ప్రకటించారు. ప్రస్తుతం దంపతులిద్దరూ సంతోషంగా ఉన్నారని కొంతకాలం ఆగి పిల్లల గురించి ఆలోచించే అవకాశం ఉంటుందన్నారు. అంటే ప్రస్తుతానికి కరీనా అక్క కరిష్మా కపూర్ పిల్లలతో మాత్రమే రణధీర్ తాతయ్య అని పిలిపించుకునే అదృష్టాన్ని పొందాడు. మరి ఈ విషయంలో సైఫ్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

ప్రేమించి పెళ్ళి చేసుకున్న సైఫ్ అలీఖాన్ - కరీనా కపూర్ ప్రస్తుతం జీవితాన్ని బాగా లీడ్ చేస్తున్నారు. ఇద్దరూ మంచి ప్రాజెక్టులతో కెరీర్ లో ముందుకు వెళ్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే పెళ్ళికి ముందు కంటే.., పెళ్లి తర్వాతే కరీనాకు పెద్ద ప్రాజెక్టులు వస్తున్నాయి. దీంతో ఈ బిజీ షెడ్యూల్ ను క్యాష్ చేసుకోవాలి తప్ప వేస్ట్ చేసుకోరాదు అని ఇద్దరూ డిసైడ్ అయి ఉంటారని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. చూద్దాం ఏ రోజుకైనా కరీనా కడుపు పండకపోతుందా.. మనకు ఆ వార్త తెలియకపోతుందా.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : karina kapoor  saif ali khan  children  latest updates  

Other Articles