Deepika padukone on remuneration difference of heros and heroines

deepika padukone on remuneration, bollywood heros remunerations, bollywood heros remuneration, tollywood heros remunerations, tollywood heroines remunerations, deepika padukone next movie, deepika padukone hot photos, bollywood latest updates, tollywood latest updates

deepika padukone on remuneration difference of heros and heroines : bollywood star heroine deepika padukone responded on remuneration difference between heros and heroines says both have popularity and working with same hardwork for the movie but heros are getting more money than heroines this is not fair and seems no equality in bollywood

అందాలు మావి.., ఆదాయాలు మీవా.? అందరి లెక్కలు తేలాల్సిందే

Posted: 10/16/2014 06:32 PM IST
Deepika padukone on remuneration difference of heros and heroines

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకునే కామెంట్ల పవర్ గురించి తెలిసిందే. ఏదైనా సూటిగా చెప్పేసే తత్వం దీపికది. తాజాగా ఇండస్ర్టీలో జరుగుతున్న లింగ వివక్షపై పడుకునే స్పందించింది. పారితోషికం విషయంలో జరుగుతున్న అన్యాయంపై గళం విప్పింది. చెల్లింపుల విషయంలో తమకు జరుగుతున్నది అన్యాయమే అని వాపోతుంది. హీరోలతో సమానంగా కష్టపడుతున్నపుడు.., వారితో సమానంగా తమకూ పారితోషికాలు ఇవ్వాలని అంటోందీ అమ్మడు. డబ్బుల విషయంపై రెండు వర్గాల మద్య కోల్డ్ వార్ జరుగుతుండగా.., దీనికి దీపిక మద్దతు పలికింది.

అయితే తమది యుద్దం కాదనీ.., వివక్షకు వ్యతిరేకంగా వ్యక్తం అవుతున్న నిరసన మాత్రమే అని చెప్పింది. హీరోలతో పోలిస్తే హీరోయిన్ల పారితోషికాలు తక్కువ. అంతేకాకుండా గడిచిన రెండు సంవత్సరాలలో హీరోయిన్లతో పోలిస్తే హీరోల వేతనాలలో చాలా మార్పులు వచ్చాయి. కానీ తమకు మాత్రం ఆ మేరకు పంపకాల పెంపు జరగలేదు అని ఆవేదన వ్యక్తం చేస్తోంది. సినిమాలో ఇద్దరిదీ సమాన భాగస్వామ్యం ఉన్నపుడు ఎందుకీ వివక్ష అని ప్రశ్నిస్తోంది. సమాన రెమ్యునరేషన్ కోసం హీరోయిన్లంతా కృషి చేస్తామని అంటోంది.

దీపిక ఇలా అంటుంటే.., ఇంకొందరు తారలు అయితే, అందాలు ఆరబోసేది తాము అయితే.., ఆదాయాలు మాత్రం హీరోల జేబులకు వెళ్తున్నాయి అని ఆవేదన వెల్లగక్కతున్నారు. థియేటర్ కు వచ్చేవారిలో హీరో, హీరోయిన్ పై అభినయంతో పాటు తమ అందాలను చూసేందుకు కూడా వస్తారన్న విషయం అందరికి తెలుసు కానీ.., ఆ మేరకు తమకు పారితోషికాలు అందటం లేదని అంటున్నారు. టాలీవుడ్ లో కూడా ఈ వాదనను కొద్దిరోజుల క్రితం కాజల్ లేవనెత్తింది. అయితే ఈ అమ్మడు పారితోషికాలను హీరోలతో కాకుండా బాలీవుడ్ తో పోల్చింది. బి టౌన్ తో పోలిస్తే తెలుగులో ఇస్తున్న డబ్బులు చాలా తక్కువ అని అసంతృప్తి వ్యక్తం చేసింది.

రెండ్రోజుల క్రితమే సినిమా ఇండస్ర్టీలో ఆడవారికి అంతగా అవకాశాలు ఉండటం లేదు. వారిని గుర్తించటం లేదు అని నటి కమిలిని ముఖర్జీ ఆవేదన వ్యక్తం చేసింది. ఇలా రోజుకో హీరోయిన్ ఒక్కో వివాదంతో తమకు జరుగుతన్న అన్యాయాలను ప్రశ్నిస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఆడవారికి వివక్ష జరుగుతున్న మాత్రం నిజం అన్పిస్తుంది. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న వీరు ఇప్పుడు ఉద్యమించేందుకు సిద్ధం అవుతున్నారు. ఇది తీవ్రరూపం కాకముందే.., అంతా మేల్కొంటే మంచిది లేకపోతే హీరోయిన్లు సినిమాలు చేయమని దీక్షలు చేపట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : deepika padukone  remuneration  bollywood  latest updates  

Other Articles