Magadheera movie hindi remake with prabhudeva

magadheera remake in bollywood, magadheera in bollywood, ramcharan next movie, ramcharan movies, magadheera bollywood remake, prabhudeva movies, sajid nadiadwala, shahid kapoor next movie, shahid kapoor movies, tollywood latest updates, bollywood latest updates

magadheera movie hindi remake with prabhudeva direction : an information that mega power star ram charan tej biggest hit movie magadheera is going to remake in hindi by director turned hero and dancer prabhudeva in sajid nadiadwala production

బాలీవుడ్ లో ‘మగధీర’ రీమేక్.. డైరెక్టర్ మైఖేల్ జాక్సన్ అట... ?

Posted: 10/17/2014 10:50 AM IST
Magadheera movie hindi remake with prabhudeva

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లోనే బిగ్ హిట్ గా నిలిచిన సినిమా ‘మగధీర’. ఈ సినిమా కంటెంట్, కమర్షియల్ హిట్ అని అంతా చెప్తారు. బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేయటంతో పాటు చెర్రికి ఓ ఇమేజ్ తీసుకువచ్చిన మూవీ ఇది. ఇంతటి హిట్ అయిన ‘మగధీర’ను హిందీలో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే హక్కులను కూడా ప్రముఖ నిర్మాత షాజిద్ నాడియాడ్ వాలా తీసేసుకున్నాడని ప్రచారం జరుగుతోంది. రీమేక్ హక్కుల కోసం నాడియాడ్ బాగానే ముట్టచెప్పాడట.

ఇకపోతే ఈ భారీ ప్రాజెక్టులోనటించేందుకు షాహిద్ కపూర్ సిద్ధం అవుతున్నాడట. హీరో విషయంలో ప్రొడ్యూసర్ కూడా ఓకే చెప్పాడని బిటౌన్ వర్గాలు అంటున్నాయి. డైరెక్టర్ విషయానికి వస్తే.. ప్రభుదేవాను పరిశీలిస్తున్నారు అని తెలుస్తోంది. డాన్సర్, హీరో నుంచి డైరెక్టర్ గా మారిన ప్రభు.. రీమేక్, డబ్బింగ్ సినిమాలు తీసి సక్సెస్ లు పొందాడు. తెలుగుతో అతనికి టచ్ కూడా ఉండటంతో కధను లోపాలు లేకుండా చక్కగా చూపించగలడు అని ఆయన్ను ఎంపిక చేస్తున్నారని సమాచారం.

అయితే హీరోయిన్ ఇంకా ఫైనల్ కాలేదు అని అంటున్నారు. తెలుగు వర్షన్ లో ఉన్న కాజల్ నే... తీసుకుంటారా లేక మరొకరిని పెడతారా అనేది త్వరలో తేలనుంది. బాలీవుడ్ ప్రేక్షకులకు కాజల్ పరిచయం ఉండటంతో పాటు.. ఈ సినిమా అనుభవం ఉండటంతో ఆమెకు ఎక్కువగా అవకాశాలున్నాయి. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ రాజమౌళి సక్సెస్ లిస్ట్ లో ఉన్న ఈ సినిమా ఇప్పుడు బాలీవుడ్ బాట పట్టింది. ప్రస్తుతం సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి.. త్వరలోనే షూటింగ్ జరగుతుందట. హిందీలో కూడా మగధీరుడికి మంచి జరగాలని కోరుకుందాం. ఆల్ ది బెస్ట్ టు రీమేకింగ్ టీం.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ram charan  magadheera  shahid kapoor  bollywood  

Other Articles