Mega family plannings on sai dharam tej and varun tej movie release dates

sai dharam tej, varun tej, pilla nuvvu leni jeevitham movie, mukunda movie, chiranjeevi, pawan kalyan, ram charan, allu arjun, allu aravind, mega family news, tollywood news, telugu film industry

mega family plannings on sai dharam tej and varun tej movie release dates

మెగాఫ్యామిలీలో అవకతవకలు.. బావా-బామర్ది మధ్య..!

Posted: 10/28/2014 12:54 PM IST
Mega family plannings on sai dharam tej and varun tej movie release dates

ప్రస్తుతం టాలీవుడ్ లో మెగాఫ్యామిలీ హవాయే ఎక్కువగా కొనసాగుతోందని చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే.. ఇప్పటికే మెగాకుటుంబం నుంచి ఎంతోమంది వారసులు స్టార్ హీరోలుగా తమకంటూ ఒక ప్రత్యేక ఇమేజీని క్రియేట్ చేసుకున్నారు. తాజాగా మరో ఇద్దరు వారసులు కూడా తమనుతాము పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇలా ఈవిధంగా తెలుగు ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా చాలావరకు ‘‘మెగా’’ ప్రస్తావన ఖచ్చితంగా వస్తుంటుంది.

ఇక అసలు విషయానికి వస్తే.. మెగాకుటుంబంలో చాలామంది వారసులు వున్న నేపథ్యంలో వాళ్లమధ్యగానీ, సినిమాపరంగాగానీ అప్పుడప్పుడు అవకతవకలు వస్తూ వుంటాయి. వ్యక్తిగత విషయాలను పక్కనపెడితే.. వీరిమధ్య మూవీలపరంగానే ఎక్కువ సమస్యలు ఏర్పడుతుంటాయని చెబుతుంటారు. అందుకే ఆ విషయంలో వీళ్లు చాలా జాగ్రత్తలు పాటిస్తారని అంటుంటారు. అందుకు ఉదాహరణగా పవన్, అల్లుఅర్జున్, రామ్ చరణ్ లను చెప్పుకోవచ్చు. ఎలాఅంటే.. వీరి లాంచింగ్ సమయంలో ఎంతో పక్కాగా ప్లాన్ చేసి, ఇతరుల చొరబాటు లేకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకునేవారు. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క సమయంలో ఇండస్ట్రీలో కాలుమోపడం వల్లే నేడు వాళ్లందరూ స్టార్ హీరోలుగా ఎదిగిపోయారు. ఇప్పటికీ తమతమ సినిమాల మధ్య పోటీలు లేకుండా ముందుగానే ప్లాన్ చేసుకుని మరీ విడుదల చేస్తారు. ఈవిధంగా మెగాకుటుంబం తమ వారసుల పట్ల చాలా కేరింగ్ గానే వుంటుంది.

ఇప్పుడు తాజాగా ఇండస్ట్రీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్న వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ విషయంలోనూ అటువంటి జాగ్రత్తలే తీసుకుంటున్నారు. కానీ ఇక్కడ సాయి ధరమ్ తేజ్ విషయంలో మాత్రం వీళ్ల ప్లాన్ కాస్త దెబ్బతింది. నిజానికి సాయి రెండేళ్లక్రితమే ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వాల్సి వుంది. వైవీఎస్ చౌదరి నిర్మించిన ‘‘రేయ్’’ మూవీలోనే సాయి నటించాడు. అయితే కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆ మూవీ ఇంకా రిలీజ్ కానేలేదు. సమస్యలు సమసిపోయి రిలీజ్ అవుతుందిలే అంటూ ఇన్నాళ్లు వెయిట్ చేశారు... కానీ అది సాధ్యం కాలేదు. అయితే ఇంతలోనే నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ ‘‘ముకుంద’’గా ఎంట్రీకి సిద్ధమయ్యాడు. నిజానికి ఇతని మూవీ ఆడియో వేడుక అక్టోబర్ లోనే ప్లాన్ చేశారు. గ్రాండ్ గా ఫంక్షన్ నిర్వహించి, డిసెంబర్ లో విడుదల చేయాలనుకున్నారు. ఐతే ‘‘రేయ్’’ మూవీ ఇంకా విడుదలకాని పక్షంలో బాగా డిజప్పాయింట్ అయిన సాయిని వదిలేస్తే అతడు మరింత ఇబ్బందుల్లో పడిపోతాడని, ముందుగా అతడి మీదే ఫోకస్ పెట్టాలని భావించారు.

అందుకే.. తక్కువ సమయంలోనే ‘‘పిల్లా నువ్వులేని జీవితం’’ సినిమాను తెరకెక్కించేసి అప్పుడే ఆడియో రిలీజ్ కూడా చేసేశారు. అలాగే నవంబర్ లోనే ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ మూవీని రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. రెండేళ్ల క్రితమే ‘‘రేయ్’’ ద్వారా ఎంట్రీ ఇవ్వాల్సిన ఇంకా రాలేదు. అంతలోనే ఆ కుటుంబం నుంచి వేరే హీరో ఎంట్రీ ఇచ్చేస్తే సాయికి మొదట్లోనే దెబ్బ పడుతుందని.. అందుకే వరుణ్ ఎంట్రీని కాస్త లేట్ చేశారని తెలుస్తోంది. ఇలా ఈవిధంగా ఈ ఇద్దరి హీరోల ఎంట్రీ కోసం మెగా ఫ్యామిలీ బాగానే కసరత్తు చేస్తోందని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles