Bobby to direct pawan kalyan gabbarsingh2

gabbarsingh2 director, gabbarsingh2 bobby director, gabbarsingh2 shooting photos, gabbarsingh2 latest updates, director bobby next movie, pawan kalyan in gabbarsingh2, raviteja sampath nandi movie, tollywood latest news, raviteja next movie, pawan kalyan next movie

bobby to direct pawan kalyan gabbarsingh2 : power movie director bobby to direct pawan kalyan high expected gabbarsingh2 movie. earlier sampath nandi fixed for gabbarsingh2 movie direction due to late he left from project recently mehar ramesh name came into talk now power movie director bobby name sounds for making of gabbarsingh2

డైరెక్టర్లను ఇచ్చిపుచ్చుకుంటున్నారు

Posted: 10/29/2014 03:15 PM IST
Bobby to direct pawan kalyan gabbarsingh2

మన టాలీవుడ్ లో ఒక హీరో సినిమాలో మరో హీరో నటించి, వాయిస్ ఇచ్చి సాయం చేయటం తెలిసిందే. అయితే ఇప్పుడు హీరోలు డైరెక్టర్లను కూడా మార్చుకుంటున్నారు. ‘గబ్బర్ సింగ్ 2’ ప్రాజెక్టు నుంచి డైరెక్టర్ సంపత్ నంది తప్పుకున్న విషయం తెలిసిందే. నంది ప్రస్తుతం రవితేజతో ఓ సినిమా చేస్తున్నాడు. ఇందుకోసం కధను చెప్పగా మాస్ మహారాజా కూడా ఓకే చెప్పేశాడు. ‘కిక్2’ తర్వాత ఈ ప్రాజెక్టు సెట్ పైకి వెళ్ళనుంది. ఇక పవన్ సినిమాకు నంది తర్వాత మెహర్ రమేష్ పేరు విన్పించింది.

అయితే తాజాగా బాబీ పేరు ప్రచారంలో ఉంది. రవితేజ ‘పవర్’ సినిమాను డైరెక్ట్ చేసిన బాబీ... ఇప్పుడు ‘గబ్బర్ సింగ్2’ మూవీని తెరకెక్కిస్తాడు అని ఫిలింనగర్ లో ప్రచారం జరుగుతోంది. పవర్ తో రవితేజకు భారి హిట్ అందించటంతో ఈప్రాజెక్టును బాబీ చేతుల్లో పెట్టేందుకు నిర్మాత ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇలా పవన్ డైరెక్టర్ మాస్ మహా రాజా సినిమా చేస్తుంటే... రవితేజ డైరెక్టర్ పవన్ ప్రాజెక్టు కోసం ముందుకు వస్తున్నాడు. కాబట్టి వీరిద్దరూ డైరెక్టర్లను ఇచ్చిపుచ్చుకుంటున్నట్లు కన్పిస్తోంది.

కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్లుగా ‘గబ్బర్ సింగ్2’ సినిమా ముహూర్తం కార్యక్రమాలు జరిగాయి. అయితే ఆ తర్వాత వివిధ కారణాలతో ఈ సినిమా సెట్ పైకి వెళ్ళలేదు. దీంతో పవన్ కోసం వేచి చూసిన సంపత్ నంది రవితేజతో సినిమా చేసేందుకు ప్రాజెక్టు నుంచి బయటకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు బాబి పేరు కూడా ప్రచారంలో ఉంది తప్ప అధికారికంగా దృవీకరించలేదు. కాబట్టి ఈయన ఓకే అవుతాడా.. లేక మరొకరు పోలిస్ కథను పట్టుకుంటారా అనేది తెలియాల్సి ఉంది.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gabbarsingh2  pawan kalyan  bobby  raviteja  

Other Articles