Naga chaitanya to act in sigaram thodu telugu remake movie

naga chaitanya upcoming movies, naga chaitanya in sigaram thodu remake, naga chaitanya movies list, nagarjuna movies, akkineni nagarjuna movies, nagarjuna latest updates, akkineni family latest, akkineni akhil movie, sigaram thodu movie updates

naga chaitanya to act in sigaram thodu telugu remake : akkineni family hero nagachaitanya to act in another remake movie nagarjuna bought tamil movie sigaram thodu remake rights for naga chaitnya

తమిళ సినిమాలో నటిస్తున్న చైతు

Posted: 10/30/2014 01:17 PM IST
Naga chaitanya to act in sigaram thodu telugu remake movie

అక్కినేని ఫ్యామిలి తరపున సినిమాల్లో బిజీగా ఉన్న నాగ చైతన్య మరో సినిమా తీసేందుకు సిద్ధం అవుతున్నాడు. ‘ఒక లైలా కోసం’ హిట్ ఎంజాయ్ చేస్తున్న చైతు త్వరలోనే ఓ తమిళ సినిమాలో నటిస్తాడట. అయితే ఇది తెలుగు రీమేక్. ఈ మద్య తమిళంలో వచ్చిన ‘సిగరం తోడు’కు ప్రేక్షకుల ఆదరణ లభించింది. కోలీవుడ్ లో కలెక్షన్లు బాగానే వసూలు చేస్తున్న విషయం తెలుసుకున్న నాగార్జున కొడుకు కోసం వెంటనే తెలుగు రీమేక్ హక్కులు కొనేసినట్లు ఫిలింనగర్ లో టాక్ విన్పిస్తోంది.

ఈ కధ చైతుకు బాగా సూట్ అవుతుందనీ.., దీనికి తోడు పూర్తిగా కుదురుకోని లవర్ బాయ్ కెరీర్ ను గాడిలో పెట్టేందుకు నాగార్జున దగ్గరుండి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కధలు, డైరెక్టర్లను స్వయంగా ఎంపిక చేస్తున్నారు. ఈ కోవలోనే తాజా ప్రాజెక్టు చైతుకు బాగుంటుందని కొనేశాడట. ఇందుకోసం బాగానే ముట్టజెప్పాడని అంటున్నారు. గతంలో ఓ తమిళ చిత్రం రీమేక్ గా ‘తడాఖా’ చేసి మోస్తరు హిట్ కొట్టాడు. అయితే ఇది అలా ఉండదు అని అక్కినేని ఫ్యామిలి సన్నిహితులు అంటున్నారు.

ఇక ‘సిగరంతోడు’ తమిళ వర్షన్ డైరెక్ట్ చేసిన గౌరవ్ తెలుగు వర్షన్ కూడా తెరకెక్కిస్తాడని అంటున్నారు. ఏటీఎం రాబరీ నేపథ్యంగా సాగే కధలో సెంటిమెంట్, యాక్షన్ ఉంటుంది. గత యాక్షన్ పార్ట్ తో పెద్దగా ఒరిగిందేమి లేదు. మరి ‘సిగరం తోడు’ చైతుకు ఎలా తోడవుతుందో చూడాలి. తన కెరీర్ చూసుకుంటూనే కొడుకుల కెరీర్ పై దృష్టి పెట్టిన నాగార్జున దగ్గరుండి వారికోసం సినిమాలు ఎంపిక చేసిపెడుతున్నాడు. ఇద్దర్నీ మంచి హీరోలను చేసేందుకు కింగ్ చాలా కష్టపడుతున్నాడు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : naga chaitanya  sigaram thodu  remake  nagarjuna  

Other Articles