Rajamouli to direct mokshagna first movie which is produced by sai korrapati

rajamouli, tollywood jakkanna, mokshagna, balakrishna, producer sai korrapati, varahi chalanachitram banner, rajamouli latest news, bahubali news, bahubali movie, mokshagna

rajamouli to direct mokshagna first movie which is produced by sai korrapati

రాజమౌళికి ‘‘మోక్షం’’ కలిగిందా?

Posted: 11/01/2014 03:39 PM IST
Rajamouli to direct mokshagna first movie which is produced by sai korrapati

రాజమౌళి.. తెలుగు చిత్రపరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దర్శకధీరుడు! టాలీవుడ్ జక్కన్నగా పేరొందిన ఆయన.. గత సంవత్సరం నుంచి ‘‘బాహుబలి’’ సినిమా షూటింగ్ లోనే బిజీబిజీగా కాలం గడపుతున్నారు. భారీప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆ మూవీలో ఎటువంటి లోపాలు లేకుండా రాత్రింబవళ్లు కష్టపడి సవరణలు చేసుకుంటున్నారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈయన ‘‘మోక్షం’’ కలిగిందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అలాగని ‘‘బాహుబలి’’ షూటింగ్ పూర్తయిపోయిందని అర్థం కాదు.. బాలకృష్ణ తనయుడైన మోక్షజ్ఞ తొలిచిత్రాన్ని రాజమౌళి డైరెక్ట్ చేసే అవకాశాలున్నాయని సమాచారం!

mokshagna

వచ్చేఏడాది మోక్షజ్ఞ వెండితెరకు పరిచయం కానున్న విషయం తెలిసిందే! ప్రస్తుతం అతను అమెరికాలో హీరోగా రాణించడానికి ప్రత్యేకంగా శిక్షణ పొందుతున్నాడు. ఇతని తొలిసినిమాకు నిర్మాతగా సాయి కొర్రపాటి వ్యవహరించనున్నారని సమాచారాలు వెలువడుతున్నాయి. నిజానికి నిర్మాత సాయి ఇటు బాలకృష్ణతోపాటు అటు రాజమౌళికి అత్యంత సన్నిహితుడు. ఈ నేపథ్యంలోనే మోక్షజ్ఞ తొలి చిత్రాన్ని రాజమౌళి చేత డైరక్ట్ చేయించాలనే ఆలోచనలో నిర్మాత ఉన్నట్టు తెలుస్తోంది. ఈమేరకు సాయి, రాజమౌళిపై ఒత్తిడి తెస్తున్నట్లుగా ప్రచారాలు కూడా కొనసాగుతున్నాయి. దీంతో రాజమౌళి కూడా ఈ విషయమై తీవ్ర ఆలోచనల మునిగిపోయినట్టు సమాచారం!

నిర్మాత సాయి తనకు ఆప్తమిత్రుడైన కారణంగా రాజమౌళి, మోక్షజ్ఞ తొలి సినిమాను తెరకెక్కించే అవకాశాలు చాలావరకు వున్నాయని టాలీవుడ్ ప్రచారాలు కొనసాగుతున్నాయి. ఒకవేళ సాయి, జక్కన్నల మధ్య ఈ సినిమా ఒప్పందం కుదిరితే.. మొదటి సినిమాతోనే మోక్షజ్ఞ భారీ విజయంతో నందమూరి అభిమానులను సంతోషపరిచే అవకాశాలున్నాయి. అయితే ఇందుకు సంబంధించి ఇంతవరకు అధికారికంగా ప్రకటన రాలేదు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rajamouli  mokshagna  balakrishna  producer sai korrapati  bahubali movie  

Other Articles