Ram charan tej as police officer in gautam menon movie

ram charan tej, ram charan latest news, ram charan police officer, ram charan latest movie news, ram charan gautam menon movie, gautam memon movies, hero ajith, anushka

ram charan tej as police officer in gautam menon movie after complete anushka ajith movie shooting

ఫైనల్ గా చెర్రీ సస్పెన్స్ రివీల్!

Posted: 11/05/2014 11:17 AM IST
Ram charan tej as police officer in gautam menon movie

‘‘గోవిందుడు అందరివాడేలే’’ సినిమా తర్వాత రామ్ చరణ్ తన తదుపరి చిత్రం గురించి ఎటువంటి వివరాలు వెల్లడించలేదు. దాంతో చెర్రీ తర్వాత సినిమా ఏంటో సస్పెన్స్ గానే మిగిలిపోయింది. ఇంతకుముందు చెర్రీ ఒక సినిమా చేస్తుండగానే మరో చిత్రాన్ని ఓకే చేసేవాడు. కానీ ఈసారి అలా జరగకపోవడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడా సమస్య లేదు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. చెర్రీ తన తర్వాత సినిమా తమిళ దర్శకుడు గౌతమ్ మీనన్ తో కలిసి తీయనున్నట్టు తెలుస్తోంది.

‘‘గోవిందుడు’’ డివైడ్ టాక్ తెచ్చుకోవడంతో కాస్త కలతచెందిన చెర్రీ.. తన తర్వాతి సినిమా విషయంలో చాలాజాగ్రత్తలు పాటిస్తున్నాడు. అందుకే.. ఆచితూచి సినిమా కథలను, పాత్రలను ఎంచకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే గౌతమ్ మీనన్ దర్శకత్వంలో చరణ్ తన తర్వాతి చిత్రానికి రెడీ అవుతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించి సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. అజిత్ - అనుష్క జంటగా గౌతమ్ మీనన్ రూపొందిస్తున్న చిత్ర నిర్మాణం చివరిదశకు చేరుకుంది. ఈ సినిమా పూర్తవగానే చరణ్ తన తదుపరి మూవీని గౌతమ్ తో ప్రారంభిస్తాడని అంటున్నారు. ఇప్పటికే వారిద్దరి మూవీకి సంబంధించి స్క్రిప్టు వర్క్ జరుగుతున్నట్టు చెబుతున్నారు.

ఇదిలావుండగా.. ఈ చిత్రంలో చెర్రీ ఒక పవర్ ఫుల్ ఆఫీసర్ గా నటిస్తున్నాడని ఇండస్ట్రీవర్గాల సమాచారం! అందుకే.. ఇటీవల తన హెయిర్ స్టయిల్ ని కూడా ఆ పాత్రకు తగ్గట్టుగానే మార్చుకున్నాడని చెబుతున్నారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన వివరాలు వెల్లడవుతాయని సమాచారం! సాధారణంగా గౌతమ్ మీనన్ తెరకెక్కించే సినిమా కథలు ప్రేమవ్యవహారాల మీదే వుంటాయి. మరి చెర్రీని పోలీస్ ఆఫీసర్ గా ఎలా ప్రెజెంట్ చేస్తాడో లేదో చూడాలి! అలాగే గతంలో చెర్రీ ‘‘జంజీర్’’ సినిమాలో పోలీస్ క్యారెక్టర్ లో నటించిన సంగతి తెలిసిందే! అయితే ఆ మూవీ చెర్రీని నిరాశపరిచింది. మరి ఈ చిత్రం చెర్రీ క్యారెక్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో..? లేదో..? చూడాలి!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ram charan tej  gautam menon  anushka  hero ajith  

Other Articles