Actress bhavan will marry kannada producer naveen in 2015

actress bhavana, bhavana latest news, bhavana hot photos, bhavana latest photo shoot, bhavana hot stills, bhavana marriage news, bhavana marriage naveen, kannada producer naveen, bhavana wikipedia, bhavana wiki

according to the sandalwood film industry news... actress bhavan will marry kannada producer naveen in 2015

సీక్రెట్ గా ప్రేమాయణం నడిపింది.. ఇప్పుడు పెళ్లికి సిద్ధమైంది!

Posted: 11/06/2014 10:58 AM IST
Actress bhavan will marry kannada producer naveen in 2015

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అన్ని భాషల్లోనూ నటిగా మంచి గుర్తింపు పొందిన భావనకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. గతంలో ఈ అమ్మడు ఒక నిర్మాతతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిందని.. త్వరలో అతడినే పెళ్లి చేసుకోబోతందనే వార్తలు బాగానే షికార్లు చేశాయి. అయితే అవన్నీ ఒట్టి రూమర్లేనని ఆమె వాటిని తుడిచిపారేసింది. కానీ.. ఈమె ప్రేమాయణం నడిపిన విషయం నిజమేనని.. ప్రేమించిన వ్యక్తినే త్వరలో పెళ్లి చేసుకోబోతోందనే వార్తలు శాండల్ వుడ్ లో వార్తలు వస్తున్నాయి. కన్నడ పరిశ్రమలో నిర్మాతగా కొనసాగుతున్న నవీన్ అనే వ్యక్తితో ప్రేమాయణం నడిపిందని.. ఇప్పుడది పెళ్లికి దారితీసిందని సమాచారం!

2012లో కన్నడ భాషలో ఈమె నటించిన ‘‘రోమియో’’ అనే చిత్రాన్ని నిర్మించిన వారిలో నవీన్ ఒకరు. ఆ చిత్రం సమయంలోనే వీరిద్దరి ప్రేమ వ్యవహారం మొదలయ్యింది. పబ్బులకు, షికార్లకు, పార్టీలకు కలిసి వెళ్లడంతో వారిద్దరు ప్రేమలో మునిగిపోయారనే ప్రచారాలు జోరుగా సాగాయి. అయితే భావన తన ప్రేమ విషయాన్ని ఖండించలేదుగానీ.. తాను ప్రేమిస్తున్న ప్రియుడెవరో పెళ్లి ఘడియలు వచ్చినప్పుడు వెల్లడిస్తానని సస్పెన్స్ లో పెట్టేసింది. మరోవైపు నవీన్ కూడా భావన తనకు మంచి స్నేహితురాలేనని చెప్పాడుగానీ.. ప్రేమ వ్యవహారంపై ఏమీ మాట్లాడలేదు.

అయితే తాజాగా వీరిద్దరి మధ్య నడిచిన ప్రేమాయణం నిజం అని తేలింది. వచ్చే ఏడాదిలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని సమాచారాలు వస్తున్నాయి. వీరి పెళ్లి భావన సొంత ఊరు అయిన తిరుచూర్ లో జరగనున్నట్టు తెలిసింది. ఇదే విషయమై వారి కుటుంబసభ్యులు వెల్లడిస్తూ.. ‘‘వచ్చే ఏడాది జనవరి 18న భావన సోదరుడి వివాహం జరగనుందని.. ఆ తర్వాత భావన పెళ్లి వుంటుంది’’ అని తెలిపారు. అయితే వాళ్లు కూడా పెళ్లికొడుకు ఎవరన్న విషయాన్ని బహిర్గతం చేయలేదు. మరి భావన చేసుకోయే పెళ్లికొడుకు నిర్మాత నవీనా.. లేక మరెవరైనా వున్నారా..? అనేది మళ్లీ సస్పెన్స్ గానే మిగిలింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : actress bhavana  kannada film industry  telugu actresses marriages  telugu news  

Other Articles