Anushka latest photo in rudramadevi

anushka in rudramadevi, anushka latest photo in rudramadevi, anushka next movie, rudramadevi latest updates, rudramadevi release date, tollywood latest updates, anushka latest photos

anushka latest photo in rudramadevi : heroine anushka latest photo in rudramadevi released on the occasion of anushka birthday gift in advance. anushka shetty looks like a princess in her latest look

అభిమానులకు రుద్రమ బర్త్ డే గిఫ్ట్ ఇదే

Posted: 11/06/2014 01:12 PM IST
Anushka latest photo in rudramadevi

పుట్టినరోజు జరుపకునే వారికి బహమతి ఇవ్వటం తెలిసిందే. కాని పుట్టినరోజు జరుపుకునే వారు బహుమతి ఇస్తే ఎలా ఉంటుంది. అదికూడా ఒకరోజు ముందుగా గిఫ్ట్ ప్రకటిస్తే ఉండే థ్రిల్, కిక్కు వేరు కదా. ప్రస్తుతం అనుష్క అభిమానులు ఈ కిక్కలో మునిగితేలుతున్నారు. నవంబర్ ఏడున పుట్టినరోజు జరుపుకుంటోన్న అందాల తార ఇందుకు ఒక్కరోజు ముందుగా అభిమానులకు తన తాజా ఫొటోను గిఫ్ట్ గా ప్రకటించింది. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ‘రుద్రమదేవి’ సినిమా తాజా ఫొటోను సినిమా యూనిట్ విడుదల చేసింది.

ఈ ఫొటోలో అనుష్క ధగదగా మెరిసిపోతుంది. మేలిమి బంగారు వర్ణం శరీరంపై... స్వచ్ఛమైన బంగారంతో చేసినట్లుగా ఉన్న ఆభరణాలు వీటికి తోడు లేత గోధుమ రంగు డ్రెస్ తో చమక్కమంటోంది. యువరాణి చూపులతో ఇట్టే కట్టిపడేస్తోంది. ఈ ఫొటో చూసిన అభిమానులు రుద్రమదేవి యువరాణిలా ఉంది అని ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ విడుదల తేదిని త్వరలోనే ప్రకటించనున్నారు.

RudramaDevi-2nd-Look

గుణశేఖర్ స్వయంగా డైరెక్ట్ చేసి, నిర్మిస్తున్న ఈ సినిమాలో అనుష్క షెట్టితో పాటు అల్లు అర్జున్, దగ్గుబాటి రానా క్యరెక్టర్లు పోషిస్తున్నారు. వీరితో పాటు నిత్య మీనన్, సుమన్, ప్రకాష్ రాజ్ తదితరులు నటిస్తున్నారు. ఇళయరాజా సంగీతం అందిస్తున్న ఈ సినిమా.. గుణ టీం వర్క్స్ బ్యానర్ పై నిర్మించారు. దాదాపు యాబై కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీపై టాలీవుడ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. అనుష్కకు ‘అరుంధతి’కి మించిన హిట్ అందిస్తుంది అని ఇండస్ర్టీలో చెప్తున్నారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : anushka  rudramadevi  photo  tollywood  

Other Articles