Subramanyam for sale sai dharam tej first look

sai dharam tej next movie, sai dharam tej in subramanyam for sale, sai dharam tej pilla nuvvu leni jeevitham release date, subramanyam for sale release date, mega family heros movies, tollywood latest news, subramanyam for sale first look

subramanyam for sale sai dharam tej first look : mega family hero sai dharam tej latest movie subramanyam for sale first look released. sai dharam tej subramanyam for sale first look got good response

ప్రొడక్షన్ నెం.3 లుక్ నెంబర్ 1

Posted: 11/06/2014 03:06 PM IST
Subramanyam for sale sai dharam tej first look

ప్రొడక్షన్ నెం.3 అనగానే గోపిచంద్ కొత్త సినిమా గుర్తుకువస్తోంది. కాని ఇప్పుడు మనం మాట్లాడుకుంటోంది. మెగా ఫ్యామిలీ హీరో సాయి ధరమ్ తేజ్ గురించి. ధరమ్ తేజ్ కొత్త సినిమా ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ ఫస్ట్ లుక్ విడుదల అయింది. ఫొటోలో రొమాంటిక్ గా కన్పిస్తున్నా..., ఎవరికో వార్నింగ్ ఇస్తున్నట్లో లేక ఛాలెంజ్ చేస్తున్నట్లుగా ఒక ఫొటో ఉంది. మరో ఫొటోలో స్పోర్స్ట్ బైక్ పక్కన నిల్చుని హీరోయిజంతో పోజు ఇచ్చాడు. మరో ఫోటోలో చేతులు జేబులో పెట్టుకుని స్టైల్ గా నడుచుకుంటూ వస్తున్నాడు.

టైటిల్ డిఫరెంట్ గా ఉండటంతో మ్యాటర్ ఏమిటా అని ప్యాన్స్ అప్పుడే డిస్కషన్స్ మొదలు పెట్టారు. గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. మిక్కిజే మేయర్ సంగీతం అందిస్తున్నాడు. అయితే హీరోయిన్ ఎవరు? అనే విషయంపై సస్పెన్స్ కొనసాగుతోంది. ‘పిల్లా నువ్వులేని జీవితం’ లో నటించిన రెజినా ఇందులో కూడా కనువిందు చేస్తుందని అంటున్నారు. కాని సినిమా యూనిట్ మాత్రం ఈ విషయాన్ని దృవీకరించటం లేదు.

ఇక ధరమ్ తేజ్ కొత్త సినిమా ‘పిల్లా నువ్వు లేని జీవితం’ విడుదలకు సిద్ధమవుతోంది. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కలిసి సినిమా నిర్మిస్తున్నాయి. ఈ మూవీకి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. అక్టోబర్ 25న విడుదలైన ఆడియోకు మంచి స్పందన వస్తోంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : subramanyam for sale  first look  sai dharam tej  tollywood  

Other Articles