Court granted anticipatory bail raghava lawrence rebel movie controversy producers bhagavan pullarao

raghava lawrence, rebel movie controversy, hero prabhas, actress tamanna bhatia, raghava lawrence news, raghava lawrence Anticipatory bail, raghava lawrence rebel movie controversy, jubilee hills police station, court issues, j bhagavan pulla rao producers, tollywood producers council, tollywood directors council, tollywood news, telugu news, telugu movie news websites, telugu political news website

court granted Anticipatory bail raghava lawrence rebel movie controversy producers bhagavan pullarao

‘రెబెల్’ రగడ నుంచి లారెన్స్ కు ‘ముందస్తు’ ఊరట!

Posted: 11/10/2014 10:10 AM IST
Court granted anticipatory bail raghava lawrence rebel movie controversy producers bhagavan pullarao

ప్రభాస్ - తమన్నా జంటగా నటించిన ‘‘రెబెల్’’ సినిమా అందరికీ గుర్తుండే వుంటుంది. ఈ సినిమాను జె.భగవాన్, పుల్లారావులు నిర్మించిగా.. ప్రముఖ డాన్సర్, మ్యూజిక్ కంపోజర్, దర్శకుడు రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించారు. అయితే  బాక్సాఫీస్ దగ్గర ఆ చిత్రం భారీగా ఫ్లాప్ అయిన నేపథ్యంలో దర్శకుడు, నిర్మాతల మధ్య కొన్ని వివాదాలు ఏర్పడ్డాయి.

నిజానికి రెబెల్ చిత్రాన్ని లారెన్స్ కేవలం రూ.22.5 కోట్లతో నిర్మిస్తానని ఆ చిత్ర నిర్మాతలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే చిత్ర నిర్మాణ సమయంలో ఆ బడ్జెట్ రూ.40 కోట్లకుపైగానే చేరుకుంది. పైగా చిత్రం ఆశించినంతగా విజయం సాధించకపోవడంతో నిర్మాతలు నష్టాలపాలయ్యారు. ఈ విషయంలోనే లారెన్స్, నిర్మాతలకు మధ్య ఒప్పందంలో భాగంగా కొన్ని తగాదాలు చోటు చేసుకున్నాయి.

భారీ బడ్జెట్ తో నిర్మించిన ‘‘రెబెల్’’ చిత్రం భారీగా బోల్తాపడటంవల్ల నిర్మాతలు లారెన్స్ పై నిర్మాతలమండలిలో ఫిర్యాదు చేశారు. ఒప్పందంకంటే ఎక్కువ వ్యయం సినిమా నిర్మాణానికి ఖర్చుచేశాడంటూ అతనిపై ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణల నేపథ్యంలో జరిగిన నష్టంలో కొంత మొత్తాన్ని తాను తిరిగిస్తానని.. దాదాపు రూ.2 కోట్ల రూపాయలు నిర్మాతలు చెల్లిస్తానని ఒప్పుకున్నాడు లారెన్స్!

అయితే తనను డబ్బులడిగితే లారెన్స్ బెదిరింపులకు పాల్పడుతున్నాడంటూ నిర్మాతలిద్దరూ అతనిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈమేరకు లారెన్స్ పై సెక్షన్ 406, 420 కింద కేసులు నమోదయ్యాయి. దీంతో అతను కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. అయితే ఈ విషయానికి సంబంధించి కోర్టు శనివారం లారెన్స్ కు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. సోమవారం సంబంధిత పోలీస్ స్టేషన్ లో హాజరు కావాలని సూచించింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles