బాలీవుడ్ లో అమీర్ ఖాన్ నటిస్తున్న పీకే మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఎప్పుడూ డిసెంబర్ లో సినిమాలు విడుదల చేసే సెంటిమెంట్ ఉన్న అమీర్, ఈ సారి కూడా అలాగే విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ లోపు ఫ్యాన్స్ కు సినిమాపై క్రేజ్ పెంచటంతో పాటు, ప్రేక్షకుల నోళ్ళలో నానేందుకు అప్పుడప్పుడూ పోస్టర్లు, ట్రైలర్లతో పాటు పాటలను విడుదల చేస్తున్నారు. గతంలో ‘తర్కీ చొక్రో’ అనే పాట విడుదల కాగా తాజాగా కూడా ఓ పాట విడుదల అయింది.
‘లవ్ ఈజ్ వేస్ట్ ఆఫ్ టైమ్’ పేరుతో విడుదల చేసిన ఈ పాటలో అమీర్ ఖాన్, అనుష్క శర్మల మద్య ప్రధానంగా సీన్లు ఉన్నాయి. ఇద్దరూ మాట్లాడుకుంటూ.., ప్రేమ గురించి వివరించుకునే నేపథ్యంగా పాట సాగింది. మంచి కాస్టూమ్స్, లొకేషన్స్ మద్య న్యాచురాలిటీకి దగ్గరగా షూట్ చేశారు. ఈ మెలోడియస్ పాటను అమితాబ్ వర్మ రాశాడు. శంతను మొయిత్రా సంగీత దర్శకత్వం వహించగా.., సోను నిగమ్, శ్రేయ ఘోషాల్ పాడటం జరిగింది. ఆ పాటను మీకోసం అందిస్తున్నాం చూసి ఎంజాయ్ చేయండి.
ఈ పాట లిరిక్స్ చాలా బాగున్నా., ట్యూన్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ వెళ్ళే తీరు మాత్రం గతంలో వచ్చిన ‘జుబి దుబి( 3 ఇడియట్స్)’, ‘పల్ పల్ (లగే రహో మున్నాభాయ్)’ పాటలను పోలి ఉంది. దీంతో రెండు కలిపి కాపి కొట్టేసి ఇందులో పెట్టేశారా అన్పిస్తుంది.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more