Samantha swachh bharat campaign hyderabad government high schools

samantha, samatha swachh bharat campaign, samantha ruth prabhu news, samantha swachh bharat news, samantha swachh bharat, tamanna swachh bharat, rakul preet singh swachh bharat, hero ram swachh bharat, narendra modi swachh bharat campaign

samantha and stylish kona participated in swachh bharat campaign at government high schools in hyderabad

మోడీ ఇచ్చిన మాటకు కట్టుబడిన సమంత!

Posted: 11/15/2014 04:51 PM IST
Samantha swachh bharat campaign hyderabad government high schools

ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రవేశపెట్టిన ‘‘స్వచ్ఛ భారత్’’ కార్యక్రమానికి రానురాను అనూహ్య స్పందన పెరిగిపోతోంది. కార్యక్రమాన్ని మొదలుపెట్టిన అనంతరం మొదట కొంతమంది ప్రముఖుల్ని నామినేట్ చేసిన ప్రధాని మోడీ.. అప్పటినుంచి ఒకర్నొకరు తారలు నామినేట్ చేసుకుంటూ ఇందులో హుషారుగా పాల్గొంటున్నారు. వాళ్ల ఇమేజ్ కి ప్లస్ పాయింట్ వస్తుందా..? లేదా..? అన్న విషయాలను కాస్త పక్కపెడితే.. మోడీ ఇచ్చిన పిలుపునకు తారలందరూ కట్టుబడి స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొనడం గర్వించదగిన విషయమే! ముఖ్యంగా టాలీవుడ్ సెలబ్రిటీలైతే ఈ కార్యక్రమంలో హుందాగా పాల్గొంటున్నారు. యువతారల నుంచి సీనియర్ నటుల వరకు అందరూ ఇందులో భాగస్వామ్యం పంచుకుంటున్నారు. ఇప్పుడు గ్లామర్ డాల్ సమంత కూడా ఆ జాబితాలో చేరిపోయింది.

తాజాగా అందాల భామ సమంత స్వచ్ఛభారత్ లో భాగంగా చీపురుపట్టి.., బాగానే చెమటోడ్చింది. స్టైలిష్ నీరజ కోన, కొంతమంది అభిమానులతో కలసి హైదరాబాద్ లోని ఒక ప్రభుత్వ పాఠశాల పరిసర ప్రాంతాలను, రహదారులను శుభ్రం చేసింది. యువ హీరో రామ్ సమంతను స్వచ్ఛ భారత్ కాంపెయిన్ లో పోల్గోనవలసిందిగా నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఈమె క్లీన్ ఇండియా కాంపెయిన్ లో తన భాద్యతను నిర్వర్తించారు. ప్రజలను చైతన్యవంతులు చేయడానికి ముందడుగు వేసి.. తనదైన శైలిలో అందరికీ మెసేజ్ ఇచ్చింది. ఇప్పటికే తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్ లు ముంబైలో స్వచ్ఛ బారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles