Zeenat aman ready for another marriage

zeenat aman, zeenat aman hot photos, zeenat aman marriage, zeenat aman second marriage, zeenat aman birthday news

zeenat aman ready for another marriage

పెళ్లికి వయసుతో పనేముందంటున్న అగ్రనటి..

Posted: 11/19/2014 10:15 PM IST
Zeenat aman ready for another marriage

సాధారణంగా పెళ్లి విషయమై ఏ హీరోయిన్ అయినా తమ అభిప్రాయాలను వెలిబుచ్చకుండా కెమెరాననుంచి దూరంగా వెళ్లిపోతుంటారు. తమ పర్సనల్ వ్యవహారాలను సైతం అంత ఎక్కువగా పంచుకోవడానికి ఇష్టపడరు. అయితే 63ఏళ్ల జీనత్ అమన్ మాత్రం తన మనసులోని కోరికలను ఇతర హీరోయిన్లలాగా దాచిపెట్టుకోకుండా బహిరంగంగా తెలుపుతోంది. తాను మరోసారి పెళ్లాడటానికి సిద్ధంగా వున్నానని అభిప్రాయం తెలిపింది. పైగా మరోసారి పెళ్లి చేసుకోవడంలో తప్పేముందని ఆమె పేర్కొంటోంది కూడా!

ఒకప్పుడు తన అందాచందాలతో బాలీవుడ్ ను హీటెక్కించేసిన జీనత్ అమన్.. బుధవారంతో ఆమెకు 63వ ఏటలో అడుగులు పెట్టింది. ఈ సందర్భంగానే ఆమె తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతూ.. తన భర్త చనిపోయినప్పటినుంచి ఇన్నాళ్లూ ఒక్కదానినే తన కొడుకులు అజాన్, జహాన్ ఇద్దరినీ చూసుకున్నానని, వాళ్లు బాగోగులు, సంతోషాలను చూస్తూనే గడిపేశానని అంటోంది. ఇప్పుడు వాళ్లు ఎదిగిపోయి తమ సొంత జీవితాల్లో స్థిరపడ్డారు కాబట్టి.. తాను తను కూడా తన సొంత జీవితం గురించి ఆలోచించాల్సిన సమయం వచ్చిందని జీనత్ చెప్పారు.

1970ల కాలంలో ఈమె వరుసగా సినిమాలు చేసుకుంటూ 24గంటలపాటు బిజీగానే తన జీవితాన్ని గడిపేవారు. అప్పట్లో ఈమెకు క్రేజ్ ఎంతుండేదంటే.. చిత్రంలో ఆమె కనిపిస్తే చాలనుకునేవాళ్లు సినీప్రముఖులతోపాటు అభిమానులు! అంతటి ఇమేజ్ వున్న ఆమె.. 1985లో మజర్ ఖాన్ ను పెళ్లి చేసుకుంది. అతన్ని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఈమె కెరీర్ కాస్త దెబ్బతింది. 15 ఏళ్లపాటు నిర్విరామంగా పనిచేసిన ఈమె.. పెళ్లయిన తర్వాత సినీఇండస్ట్రీ నుంచి దూరమయ్యింది. అప్పుడు తాను తన భర్త, పిల్లల మీదే ఎక్కువ దృష్టి పెట్టానని.. ఇఫ్పుడు చాన్నాళ్ల తర్వాత తనకు తన జీవితం గురించి ఆలోచించే సమయం దొరికిందని అంటోంది. ఐతే పెళ్లెప్పుడనేది మాత్రం చెప్పలేదు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : zeenat aman  bollywood celebrities  bollywood news  telugu actresses  telugu news  

Other Articles