Avunu 2 movie first poster actress poorna elephant stunts ravibabu

avunu 2 movie, avunu 2 movie first poster, ravibabu, director ravibabu, producer ravibabu, producer suresh babu, suresh babu productions, producer suresh babu news, actress poorna, poorna hot photos, poorna latest news

avunu 2 movie first poster actress poorna elephant stunts ravibabu

ఏనుగుల మధ్య నలిగిపోయిన తెలుగునటి!

Posted: 11/24/2014 12:09 PM IST
Avunu 2 movie first poster actress poorna elephant stunts ravibabu

‘అవును’ సినిమా ద్వారా నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న పూర్ణ.. ఆ సినిమా మంచి విజయం సాధించడంతో దానికి సీక్వెల్’గా ‘అవును-2’ తెరకెక్కుతున్న చిత్రంలోనూ ఆమె నటిస్తున్న విషయం తెలిసిందే! ఇదివరకే ఈ మూవీకి సంబంధించి విడుదలైన ట్రైలర్’కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే లభించింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ పోస్టర్’ను విడుదల చేశారు. ఇందులో పూర్ణ రెండు ఏనుగుల మధ్య నలిగిపోతూ.. రెడ్ చీరలో సెక్సీగా కనువిందు చేస్తోంది. గతంలో విడుదలైన ‘అవును’ పోస్టర్’లోనూ ఇదేవిధంగా ఒక ఏనుగు కాళ్ల మధ్య నలిగిన ఈ నటిని.. ఇప్పుడు రెండు ఏనుగుల మధ్య బంధీగా వున్నట్లుగా పోస్టర్’ను విడుదల చేశారు దర్శకనిర్మాతలు.

సురేష్ ప్రొడక్షన్స్, ఫ్లయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్ సంస్థల బ్యానర్ లో వస్తున్న ఈ సినమాను రవిబాబు సొంతంగా కధ రాసుకుని ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. అలాగే స్వీయనిర్మాతగా వ్యవహరిస్తున్న రవిబాబు.. మొదటి సినిమాకంటే ఈ మూవీపై చాలానే ఆశలు పెట్టుకున్నాడు. ఏ విధంగా అయితే మొదటిపార్ట్ మంచి విజయాన్ని అందుకుందో.. దానికంటే రెట్టింపు విజయాన్ని సాధించాలనే ఆశతో వున్నాడని సమాచారం! అందుకే.. ఈ సినిమాకు సంబంధించి వైరెటీ ట్రైలర్, పోస్టర్ల ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ట్రై చేస్తున్నాడు. మరి ఈ సినిమాను ప్రేక్షకులు ఎటువంటి విజయాన్ని అందిస్తారో వేచి చూడాలి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : avunu 2 movie  ravibabu  suresh babu productions  actress poorna  telugu news  

Other Articles