Kalyan ram pataas movie logo first look photo poster

kalyan ram pataas movie, kalyan ram pataas movie first look photo, kalyan ram pataas movie photos trailer teaser, kalyan ram in pataas movie, kalyan ram next movie updates, pataas movie release date, tollywood latest news updates ntr temper movie first look

kalyan ram pataas movie logo first look photo poster : nandamuri kalyan ram latest movie patas

పేలిన పటాస్ టైటిల్ లుక్

Posted: 11/27/2014 05:03 PM IST
Kalyan ram pataas movie logo first look photo poster

నందమూరి ఫ్యాన్స్ ఒకేరోజు రెండు పండగలు వచ్చినంత సంతోషంగా ఉన్నారు. ఎన్టీఆర్ తాజా సినిమా ‘టెంపర్’ ఫస్ట్ లుక్ విడుదల కాగా., మరొక విశేషంలా కళ్యాణ్ రామ్ కొత్త సినిమా ‘పటాస్’ టైటిల్ లోగో విడుదల అయింది. మాస్ లుక్ లో కన్పిస్తున్న కళ్యాణ్ రామ్ ఫొటో ఫుల్ ఎనర్జిటిక్ గా ఉంది. లోగోలో దేశ ఎంబ్లమ్ చూపించటంతో సినిమాలో పవర్ ఫుల్ పోలిస్ క్యారెక్టర్ లో కన్పిస్తాడని అర్థమవుతోంది. అన్నట్లు ‘టెంపర్’ సినిమాలోనూ ఎన్టీఆర్ పోలిస్ ఆఫీసర్ క్యారెక్టర్ లోనే కన్పిస్తుండటం విశేషం.

ఎన్టీఆర్ ఆర్ట్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ సొంతంగా నిర్మిస్తున్న ‘పటాస్’ మూవీ డిసెంబర్ చివరి వారంలో విడుదల కానుంది. అనిల్ రావిపూడి ఈ ప్రాజెక్టును తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. సంక్రాంతికి పెద్ద సినిమాలు పోటి పడుతున్న నేపథ్యంలో ఏడాది చివర్లో, పండగకు ముందుగానే సింగిల్ గా వచ్చి కలెక్షన్లు వసూలు చేసుకునే ఉద్దేశ్యంతో ఈ సినిమా విడుదల అవుతోంది.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : kalyan ram  pataas  first look photo  movie  latest news  

Other Articles