Kannada thespian rajkumar s memorial inaugurated chiru rajini recall golden memories bring annavru alive

Sandalwood idol, Dr. Rajkumar', memorial, inauguration, kannada Kanteerava, Bengaluru, Rajinikanth, Chiranjeevi, CM Siddaramiah, autograph, Goddess Saraswathi, icon of fans,. Humanitarian

Kannada thespian Rajkumar's memorial inaugurated, Chiru, Rajini recall golden memories, bring Annavru alive

రాజ్ కుమార్ పెద్ద మానవతావాది: చిరంజీవి

Posted: 11/30/2014 01:34 PM IST
Kannada thespian rajkumar s memorial inaugurated chiru rajini recall golden memories bring annavru alive

కన్నడ కంఠీరవుడు ప్రముఖ నటుడు, స్వర్గీయ డాక్టర్ రాజ్‌కుమార్ గొప్ప మానవతావాదని మెగాస్టార్, రాజ్యసభః సభ్యడు చిరంజీవి అన్నారు.. రాజ్‌కుమార్‌కు సరితూగే వ్యక్తి కర్ణాటకలోనే కాదు భారతదేశంలోనే లేరని అన్నారు. కన్నడ నటుడు డాక్టర్ రాజ్‌కుమార్ స్మరణ మందిరాన్నిబెంగళూరులో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ, కళా ప్రముఖులు విచ్చేసి రాజ్‌కుమార్‌కు నివాళులర్పించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ తాను, రాజ్ కలుసుకున్నప్పుడల్లా తెలుగులోనే మాట్లాడుకునే వాళ్లమన్నారు. తాను ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ విద్యార్థిగా ఉన్నప్పుడు ఓ సందర్భంలో రాజ్‌కుమార్‌ను కలిశానని, అప్పటికే ఆయన ప్రముఖ కథానాయకుడన్నారు.  అయినప్పటికీ తనతో ఎంతో వినయంగా మాట్లాడారని గుర్తుచేసుకున్నారు.

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ మాట్లాడుతూ 1923లో ముత్తురాజ్ (రాజ్‌కుమార్ అసలు పేరు) అనే నీటి చుక్క భూమిపై పడింది. అది కన్నడ భూమిలో మురిసింది. ఆ నీటి చుక్క ఏకంగా ఐదున్నర దశాబ్దాలపాటు కన్నడ చిత్రసీమను ఏలింది'' అని రాజ్‌కుమార్‌ను ప్రస్తుతించారు. రాజ్ కుమార్ సరస్వతీ కటాక్షం పోందిన గొప్ప అదృష్టవంతుడని కోనియాడారు. ఒక రోజు బెంగళూరులో తాను, రాజ్ కుమార్ నడుస్తుండగా ఆయనకు రిక్షవాలాల దగ్గరి నుంచి కారులో వెళ్లే వాళ్ల వరకు అందరు నమస్కరించారని.. అయితే వారు తనకు నమస్కరించలేదని, తనలోని సరస్వతీ మాతకు నమస్కరించారని రాజ్ కుమార్ తనతో చెప్పారన్నారు. ఎప్పడు మనిషికి గర్వం, అహం రాకూడదని కూడా తనకు రాజ్ కుమార్ చెప్పారని రజినీ తెలిపారు.

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ రాజ్‌కుమార్ స్ఫూర్తితో తానూ మరణానంతరం కళ్లను దానం చేస్తున్నట్లు ప్రకటించారు. వేదికపైనే అందుకు సంబంధించిన ప్రమాణ పత్రాలపై సంతకం చేశారు. కార్యక్రమంలో నటి బి.సరోజాదేవి, కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడ, కర్ణాటక మంత్రులు అంబరీష్, రోషన్‌బేగ్, ఉమాశ్రీ తదితరులు పాల్గొన్నారు. రాజ్‌కుమార్ భార్య పార్వతమ్మ రాజ్ కుమార్, కుమారులు శివరాజ్ కుమార్, రాఘవేంద్రరాజ్ కుమార్, పునీత్ రాజ్‌కుమార్, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వేలాది మంది అభిమానులు పాల్గొన్నారు. కంఠీరవ స్టూడియో ప్రాంగణంలోని రాజ్‌కుమార్ సమాధి పరిసరాల్ని కర్ణాటక ప్రభుత్వం ఏడు కోట్ల రూపాయలతో స్మారకంగా తీర్చిదిద్దింది.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles