Tollywood film emplyoees strike called off starts shootings

tollywood employees strike, tollywood industry strike, telugu film industry producers council, tollywood employees strike demands, sankranti 2015 telugu movies, gopala gopala release, temper release, rudrama devi movie release, tollywood latest news updates

tollywood film emplyoees strike called off starts shootings : tollywood film industry employees strike called off after their talks with movie producers council are successful, shootings of tollywood movies starts from 06th december after strike

టాలీవుడ్ లో ముగిసిన సమ్మె

Posted: 12/06/2014 08:28 AM IST
Tollywood film emplyoees strike called off starts shootings

వారం రోజుల సమ్మెకు తెరపడింది. వేతనాల సవరణ కోరుతూ సమ్మె చేస్తున్న కార్మికులతో నిర్మాతల మండలి జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. దీంతో ఇవాళ్టి నుంచి మళ్ళీ ఇండస్ర్టీలో షూటింగులు మొదలయ్యాయి. దీంతో వారం రోజులుగా పనులు లేకుండా ఖాళీగా ఉన్న కార్మికులు, టెక్నిషియన్లు మళ్ళీ సెట్ లోకి వచ్చేస్తున్నారు. అంతటా షూటింగ్ కోలాహలం కొనసాగుతోంది. వేతనాల పెంపు కోరుతూ గత నెల 27నుంచి కార్మికులు సమ్మె చేపట్టారు. అయితే సంక్రాంతి పండగ దగ్గరపడుతుండటంతో పాటు.., వేతనాల సవరణపై కార్మిక శాఖ జోక్యం నేపథ్యంలో శుక్రవారం జరిపిన చర్చలు సఫలం అయ్యాయి

దీంతో ఎన్టీఆర్ -పూరీ జగన్నాధ్ కాంబినేషన్ లో వస్తున్న ‘టెంపర్’ సహా, ఇతర సినిమాల షూటింగ్ తిరిగి ప్రారంభం అవుతున్నాయి. సంక్రాంతి పండగ దగ్గరపడుతున్న సమయంలో విడుదలకు ముహూర్తం ఖరారు చేసుకున్న చాలా సినిమాలు సమ్మెపై ఆందోళన వ్యక్తం చేశాయి. షూటింగులు జరగకపోతే పండగకు సినిమాలు విడుదల కావని భయపడ్డారు. అయితే చర్చలు సఫలం కావటంతో కార్మికులతో పాటు సినిమా డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, హీరోలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వర్క్ టైం పెంచి అయినా షెడ్యూల్ ను అనుకున్న టైంకు పూర్తి చేస్తామని డైరెక్టర్లు చెప్తున్నారు. అయితే బిజీ షెడ్యూల్ తో పని చేసినా సమయం తక్కువగా ఉండటంతో సినిమాల విడుదలపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles