కోట్లు ఖర్చుపెట్టి భారీ బడ్జెట్ సినిమాలు తీసే నిర్మాతల ఇబ్బందులు చెప్పతరం కాదు. సినిమా హిట్ అవుతుందా.., ఫ్లాప్ అవుతుందా అనేది డిసైడ్ కాకుండానే అప్పలు తెచ్చి కోట్లు కుమ్మరిస్తారు. పైకి గొప్పగా చెప్పుకుంటున్నా లోపాల ఉండే అసలు విషయాలు బయటకు చెప్పరు. పెద్ద నిర్మాతగా ఎదిగిన బండ్ల గణేష్ తాజా సినిమా ‘టెంపర్’ మూవీ సంక్రాంతి విడుదలకు సిద్దమవుతోంది. షూటింగ్ చివరిదశలో ఉన్న ఈ సినిమా.., డిస్ర్టిబ్యూషన్ ప్రక్రియ కొద్దికాలంగా కొనసాగుతోంది. పెద్ద సినిమాలతో పాటు ఈ ఏడాది చివర్లో వరుసగా సినిమాలు వస్తుండటంతో ఏంచేయాలో తెలియక డిస్ర్టిబ్యూటర్లు డైలమాలో పడ్డారు.
అటు ఈ మూవీ గురించి మరో విషయం విన్పిస్తోంది. సినిమా చేసినందుకు డబ్బులు ఇవ్వకుండా వాటాలు ఇస్తున్నారని అనుకుంటున్నారు. హీరోగా నటించిన ఎన్టీఆర్ నైజాం హక్కులు తీసుకోగా.., డైరెక్టర్ పూరీ జగన్నాథ్ సీడెడ్ హక్కులు తీసకున్నాడట. ఇక కథ అందించిన వక్కంతం వంశీ నెల్లూరు జిల్లా హక్కులు తీసుకున్నట్లు తెలుస్తోంది. నిర్మాతకు ఉన్న ఆర్ధిక ఇబ్బందుల వల్లే.., డబ్బులు చెల్లించలేక ఇలా వాటాలు కేటాయించినట్లు గుసగుసలు విన్పిస్తున్నాయి. ఇవిపోగా మిగిలిన వాటాలను నిర్మాత మార్కెట్ చేసుకోనున్నారు.
పెద్ద సినిమాలు తీసి ఆశించిన స్థాయిలో డబ్బులు రాకపోవటంతో బండ్లకు ఈ కష్టాలు వచ్చినట్లు సన్నిహితులు చెప్తున్నారు. ఎన్టీఆర్ పవర్ ఫుల్ పోలిస్ ఆఫీసర్ గా కన్పిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. సంక్రాంతి పండగను టార్గెట్ చేసుకుని సినిమా షూటింగ్ ను ఆన్ టైం లో పూర్తి చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. వంశీ కథతో పాటు, ఎన్టీఆర్ యాక్టింగ్ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఆర్ధిక ఇబ్బందుల్లోనూ సినిమా తీసిన నిర్మాత బండ్ల గణేష్ ను అభినందించాలి. ఈ పండగ ఆయన కష్టాలను తీర్చాలని కోరుకుందాం.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more