Pawan kalyan second daughter

pawan kalyan second daughter, pawan kalyan third wife daughter, pawan kalyan son and daughter, akhira aadya latest photos, renu desai pawan kalyan son daughter, pawan kalyan marriages, pawan kalyan next movie updates, tollywood latest news updates

pawan kalyan second daughter : a photo of baby with pawan kalyan surfing in internet by fans says that she is baby of pawan and some of people says baby is second daughter of pawan

దుమారం రేపుతున్న పవన్ ఫోటో లీక్

Posted: 12/08/2014 11:21 AM IST
Pawan kalyan second daughter

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఏ విషయం తెలిసినా అదో సంచలనం అవుతుంది. లెక్కలేనంత ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న పవర్ స్టార్ గురించి ఇండస్ట్రీలో హాట్ డిస్కషన్ నడుస్తోంది. పవన్ కు రెండవ కూతురు పుట్టిందనీ., ఆమెతో కలిసి ఆడుకుంటున్నారని కూడా అంటున్నారు. ఈ మద్య ఇంటర్నెట్ లో ప్రత్యక్షం అయిన ఓ ఫోటోనే దీనికి కారణం. ఇంట్లో సోఫాలో కూర్చుని చిన్న పాపాయితో కలసి పవన్ ఆడుకుంటున్న ఫొటో బాగా పాపులర్ అయింది. ఈ ఫోటో చూసిన చాలామంది పవన్ బేబి అంటున్నారు. ఇంకొందరితే ఈ పాపాయి పవన్ కూతురు అని ఫిక్స్ చేస్తున్నారు.

ఈ ఫోటో చాలకాలం క్రితంది అనుకుందామంటే.., పక్కన టీవీ ఛానెల్ లో వస్తున్న ప్రోగ్రాంను చూపిస్తూ ప్రశ్నిస్తున్నారు. జీ తెలుగులో ప్రముఖ చెఫ్ వంటల ప్రొగ్రాం కొద్దికాలంగా మాత్రమే వస్తుండటంతో ఫోటో ఈ మద్య దిగినది.., కాబట్టి ఖచ్చితంగా పవన్ కూతురు ఫోటో అయి ఉంటుంది అని చెప్తున్నారు. కూతురుతో ఆడుకుంటుూ వంటలు నేర్చుకుంటున్నారు అని సరదాగా కామెంట్లు చేసుకుంటున్నారు. అయితే ఎప్పుడూ పర్సనల్ విషయాలపై స్పందించని పవన్.., దీనిపై కూడా కామెంట్ చేసే అవకాశం లేదు.

ఇక పవన్ సినిమాల విషయానికి వస్తే.., ఆయన ప్రస్తుతం నటిస్తున్న ‘గోపాల గోపాల’ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ మూవీ సంక్రాంతికి విడుదల కానుంది. ఈ నెలలో ఆడియో రిలీజ్ ను ప్రత్యేకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మూవీ తర్వాత బాబితో కలిసి ‘గబ్బర్ సింగ్2’లో పవన్ నటించనున్నాడు. ఈ నెల చివర్లో లేదా.., వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. ‘గబ్బర్ సింగ్2’లో అనిషా అంబ్రోస్ తో పాటు, రకుల్ ప్రీత్ సింగ్ ఎంపిక అయినట్లు ఆ మద్య గుసగుసలు వచ్చాయి.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : pawan kalyan  pawan kalyan daughter  renu desai children  

Other Articles