Sonakshi sinha ram charan teja combination movie

sonakshi sinha ram charan tej movie updates, sonakshi sinha in ram charan tej movie, ram charan tej movie updates ram charan teja srinu vaitla movie updates, srinu vaitla ram charan teja movie updates, tollywood latest news updates, mukunda release date

sonakshi sinha ram charan teja combination movie : filmnagar rumors that lingaa movie heroine sonakshi sinha to act in ram charan tej movie in srinu vaitla direction, ram charan tej, sonakshi sinha combination movie shooting will start by 2015 february

నక్కతోక తొక్కినట్లుంది... త్వరలో మెగా హీరోతో సినిమా

Posted: 12/11/2014 09:55 AM IST
Sonakshi sinha ram charan teja combination movie

‘లింగా’ సినిమాతో సౌత్ లోకి ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా.., నక్కను తొక్కి వచ్చినట్లుంది. అందుకే సౌత్ లో తొలి సినిమానే సూపర్ స్టార్ రజినీతో చేసింది. ఈ సినిమా శుక్రవారం విడుదలకానుంది. తమిళంలో ఇప్పటికే పలు ప్రాజెక్టులు అమ్మడి సైన్ కోసం వెయిట్ చేస్తున్నాయి. మరోవైపు ఈ భామ టాలీవుడ్ కు వస్తున్నట్లు సన్నిహితులు చెప్తున్నారు. తెలుగు తెరపై కన్నేసిన సోను.., త్వరలోనే మెగా హీరోతో జతకట్టనుందని ఫిలింనగర్ వర్గాలు అంటున్నాయి.
త్వరలో తెలుగు తెరకు పరిచయం కానుంది.

రామ్ చరణ్ తో శ్రీనువైట్ల త్వరలోనే సినిమా చేస్తాడన్న విషయం తెలిసిందే. ఈ సినిమా కథ, షూటింగ్ షెడ్యూల్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. అయితే వక్కంతం వంశీ స్టోరీ లైన్ కు ఓకే చెప్పినట్లు మెగా కంపౌండ్ నుంచి సమాచారం వస్తోంది. ఈ ప్రాజెక్టులో సోనాక్షి సిన్హాను హీరోయిన్ గా పరిశీలిస్తున్నట్లు లేటెస్ట్ అప్ డేట్. అటు ‘లింగా’ హీరోయిన్ కూడా చరణ్ తో మూవీకి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. త్వరలోనే కాల్షీట్లు కూడా ఇస్తుందని అంటున్నారు. కథకు తుది మెరుగులు దిద్దటం పూర్తయితే.., డిసెంబర్ చివర్లో లేదా, జనవరి చివర్లో సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.

‘గోవిందుడు అందరివాడేలే’ తర్వాత చరణ్ నటిస్తున్న సినిమా ఇదే. ‘ఆగడు’ ఫ్లాప్ తర్వాత చరణ్ తో సినిమా దక్కించుకునేందుకు శ్రీనువైట్ల చాలా కష్టాలు పడ్డారు. పలు కథలు చెప్పి.., వాటిని మెచ్చకుంటే వంశీతో కథ రాయించి తీసుకొచ్చి మరీ ప్రాజెక్టును ఓకే చేయించుకున్నారు. ‘ఆగడు’ ఫ్లాప్ తో మేల్కొన్న వైట్ల.., తర్వాతి సినిమాల్లో పంచ్ డైలాగులతో పాటు.., హీరోలతో కామెడిని తక్కువ చేసే అవకాశం ఉందట. హీరోకు బదులుగా సైడ్ క్యారెక్టర్లతో కామెడిని నింపేసి.., హీరోను ఫుల్ యాక్షన్ తో నింపి ప్రేక్షకులపైకి వదులుతారని టాలీవుడ్ వర్గాల సమాచారం. ఈ ప్రాజెక్టు షూటింగ్ మొదలయితే సినిమా గురించి మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles