Chakri died family problems family members harrassed wife

music director chakri wife harassed, chakri family harssments, music director chakri death reasons, chakri wife harassed, chakri death latest updates, chakri wife interview, tollywood latest news updates

chakri died family problems family members harrassed wife : a shocking news that chakri death is not of heavy body its because of family problems, chakri wife refused to comment on his family members harassment but not rejected mother in law family side harassment rumors

చక్రి మరణం వెనక వాస్తవాలు..

Posted: 12/18/2014 07:31 AM IST
Chakri died family problems family members harrassed wife

సంగీత రారాజు చక్రి మరణం నుంచి టాలీవుడ్ ఇంకా కోలుకోలేదు. కానీ అప్పుడే మరణంపై అనుమానాలు వస్తున్నాయి. ఆయన గుండెనొప్పికి వేళాపాలా లేని తిండి కారణం కాదనీ..., కుటుంబ వేధింపులు, ఆర్ధిక  సమస్యల వల్ల కలిగిన బాధ కారణం అని విమర్శలు వస్తున్నాయి. చక్రి భార్య శ్రావణి తాజా మాటలతో ఈ విషయం నిజమని తెలుస్తోంది. చక్రిని ఆమే చంపేసిందని కుటుంబ సభ్యులు వేధించటంతో పాటు ఆమెను శారీరకంగా, మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారట. ఈ మేరకు అత్తింటివారిపై శ్రావణి మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేసింది.

ఈ విషయమై ప్రశ్నించిన మీడియాను.., ‘దయచేసి ఇప్పుడు ఏమి అడగవద్దు. కర్మ కార్యక్రమాలు జరిగిన తర్వాత అన్ని వివరాలు వెల్లడిస్తాను’ అని చెప్పింది. అత్తింటివారి వేధింపులు వాస్తవమేనా అని ప్రశ్నించగా.., ‘అన్నీ దేవుడికే తెలుసు’ అని చెప్పింది తప్ప కాదు అని సమాధానం ఇవ్వలేదు. దీంతో వేధింపుల మాట వాస్తవమే అని అర్థమవుతోంది. సన్నిహితుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. చక్రి-శ్రావణి పదేళ్ళ క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ పెళ్ళి చక్రి కుటుంబం అంగీకరించలేదు. కొంతకాలంపాటు దూరంగా ఉన్నారు. ఈ సమయంలోనే శ్రావణిపై దాడులు కూడా జరిగాయని తెలుస్తోంది. ఈ మద్యనే రాకపోకలు మొదలు పెట్టారు. అయితే నెల రోజుల క్రితం అత్త, మరిది ఇంటినుంచి వెళ్ళిపోయారు.

చక్రి ఆరోగ్య పరిస్థితిపై సమాచారం ఇచ్చినా కుటుంబ సభ్యులు సరిగా స్పందించలేదని ఆరోపణలు ఉన్నాయి. చనిపోయాడని తెలియగానే.., కుటుంబ సభ్యులు వచ్చి చూశారు. అయితే ఆ సమయంలో కూడా శ్రావణిని వారు పట్టించుకోలేదు. ఆమెకు ఫిట్స్ వచ్చినా కూడా ఎవరూ స్పందించలేదు. ఇక ఇంటికి వెళ్ళాక.., కప్ బోర్డులన్నీ తాళాలు వేసుకున్నారు. డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు తీసుకోవటంతో పాటు.. కనీసం కట్టుకోవడానికి బట్టలు కూడా లేకుండా ఉన్నట్లు చక్రి భార్య తెలిపింది. తనకు అత్తింటివారి కంటే బయటివారే ఆదుకుంటున్నారని చెప్పింది.

మరోవైపు చక్రికి ఆర్ధిక సమస్యలు కూడా ఉన్నట్లు పలువురు అనుకుంటున్నారు. గతంలో వరుసగా సినిమాలకు సంగీతం అందించిన చక్రీకి ఈ మద్య ఆఫర్లు తగ్గాయి. దీంతో ఆర్దిక ఇబ్బందులు మొదలయినట్లు చెప్తున్నారు. వంద సినిమాల వరకు సంగీతం అందించినా., కొద్ది మొత్తంలో స్థిరాస్తులు మినహా పెద్దగా డబ్బు లేదని అంటున్నారు. ఇలా ఆర్ధిక ఇబ్బందులతో పాటు, కుటుంబ వేధింపులు కూడా చక్రిని క్రుంగతీయటంతో గుండెపోటు వచ్చినట్లు అనకుంటున్నారు. సంగీత ప్రపంచానికి చక్రవర్తిలా నిలిచిన వ్యక్తి వెనక ఇంత విషాదం  ఉందంటే బాధగా ఉంది. అయినవారు లేకేపోతే ఎలా ఉంటుందో శ్రావణిని చూస్తే అర్థం అవుతుంది.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chakri wife comments  chakri death reasons  tollywood latest  

Other Articles