Nandamuri balakrishna warrior movie latest look christmas gift

balakrishna warrior latest poster, balakrishna warrior posters, balakrishna warrior photos teasers, balakrishna warrior movie cast and crew, balakrishna movie updates, balayya funny image, balakrishna ntr funny photos for facebook, satyadeva movies

nandamuri balakrishna warrior movie latest look christmas gift : balakrishna announced new year gift to fans but with saying any thing movie unit releases latest poster silently as christmas` gift

మరోసారి దుమ్మలేపిన బాలయ్య

Posted: 12/24/2014 04:05 PM IST
Nandamuri balakrishna warrior movie latest look christmas gift

అభిమానులు కోరుకున్నట్లు నటించే తెలుగు హీరోల్లో బాలకృష్ణ ముందు వరుసలో ఉంటాడన్న విషయం చెప్పనక్కర్లేదు. కొత్త హీరోలు ఎందరు వచ్చినా వారికి ధీటుగా స్టైల్, డాన్స్, డైలాగ్స్ వదిలే సత్తా బాలయ్యకే ఉంది. అందుకే నందమూరి నట వంశంలో యువరత్నకు చాలా క్రేజ్ ఉంది. ప్రస్తుతం సత్యదేవ సినిమాలో నటిస్తున్న బాలయ్య.. ఫ్యాన్స్ కు న్యూ ఇయర్ కానుకను ఇస్తానని ప్రకటించారు. దీనికోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తుండగానే..., చెప్పాపెట్టకుండా సెకండ్ లుక్ తో బయటకు వచ్చారు. ఈ ఫొటోతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేయటంతో పాటు ఆశ్చర్యంగా ఫీల్ అవుతున్నారు.

ఫొటో వచ్చినందుకు సంతోషం వ్యక్తం చేస్తుంటే.., ఆయన వాడిన కారు చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే బాలయ్య కారు నంబర్ మధ్యప్రదేశ్ రిజిస్ర్టేషన్ నంబర్ తో ఉంది. అంటే ఈ సినిమాలో మధ్యప్రదేశ్ కు హీరోకు సంబంధం ఉంటుంది. గతంలో సత్యదేవ చెప్పిన ప్రకారం, సమాజ హితం కోసం ఓ కామన్ మ్యాన్ ఎలా పోరాడాడో చూపిస్తామని గుర్తు. ఆయన మాటల ప్రకారం ‘లెజెండ్’కు మించిన రేంజ్ లో తెలుగుదనం గురించి వివరించేలా సినిమా ఉంటుందని ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు. అయితే పోస్టర్ చూశాక సినిమాలో బాలయ్య తెలుగోడు కాదేమో అనుకుంటున్నారు.

ఇక మూవీ విషయానికి వస్తే.., ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ట్రైలర్ 31డిసెంబర్ 2014 అర్ధరాత్రి 12గంటలకు విడుదల కానుంది. సత్యదేవ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్ల సరసన బాలయ్య నటించారు. ఈ మద్య రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ కు వచ్చినట్లే ఈ పోస్టర్ కు కూడా మంచి స్పందన వస్తోంది.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : balakrishna latest photos  warrior movie updates  tollywood latest  

Other Articles