Manchu lakshmi adavi sesh pilavani perantam movie updates

manchu lakshmi pilavani perantam movie, manchu lakshmi pilavani perantam movie updates, manchu lakshmi pilavani perantam movie latest, manchu lakshmi pilavani perantam cast and crew, manchu lakshmi budugu movie updates, manchu lakshmi budugu movie trailer, manchu lakshmi budugu cast and crew, manchu lakshmi latest photos wallpapers, tollywood latest news updates

manchu laxmi adavi sesh pilavani perantam movie updates : manchu laxmi latest movie Pilavani Perantam have male role with adavi sesh as lakshmi husband. manchu lakshmi budugu and pilavani perantam movie shootings in progress mode with lady role as a house wife character

లక్ష్మికి అడవి యోగం... ఆంటీతో రొమాన్స్

Posted: 12/26/2014 12:35 PM IST
Manchu lakshmi adavi sesh pilavani perantam movie updates

టాలీవుడ్ సంచలన లేడి నటీమణుల్లో ముందుండేది మంచు లక్ష్మి. డ్రెస్సింగ్, స్టైల్, నటన, కామెంట్లు ఇలా అన్ని విషయాల్లోనూ నేనున్నాను అంటూ అందరికంటే డిఫరెంట్ గా ఆలోచించే మంచు ఆడపడుచుకు సినిమాలపై మక్కువ తగ్గటం లేదు. అందుకే ఆలోచన రాగానే.., సినిమా మొదలు పెడుతుందీ ఇద్దరు పిల్లల తల్లి. ప్రస్తుతం ‘పిలవని పేరంటం’ అనే సినిమా పనుల్లో బిజీగా ఉంది. లక్ష్మిప్రసన్న గృహిణిగా నటిస్తున్న ఈ మూవీలో అడవి శేష్ హీరోగా నటిస్తున్నాడని లేటెస్ట్ అప్ డేట్. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో అడవితో  లక్ష్మి జతకడుతోంది.

‘జగన్ నిర్దోషి’ ఫేం వెంకన్న బాబు ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతో పాటు ‘బుడుగు’ అనే మూవీలో కూడా లక్ష్మి నటిస్తోంది. క్రిస్మస్ కానుకగా రెండ్రోజుల క్రితమే ఈ మూవీ ట్రైలర్ విడుదల అయ్యింది. దెయ్యం పట్టిన కొడుకుని కాపాడుకునే తల్లిగా ఈ మూవీలో ఆమె కన్పిస్తుంది. శ్రీధర్ రావు భర్తగా, మాస్టర్ ప్రేమ్ బాబు అబ్బాయి పాత్రల్లో నటిస్తున్నారు. అడవి శేష్ విషయానికి వస్తే.., మంచు లక్ష్మి సినిమాతో పాటు రాజమౌళి తెరకెక్కిస్తున్న పీరియాడికల్ మూవీ ‘బాహుబలి’లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అదేవిధంగా ‘క్షణం’ అనే థ్రిల్లర్ సినిమాలో నటిస్తున్నాడు. ‘పంజా’తో పాపులర్ అయిన అడవి శేష్ కు మంచి ఆఫర్లు వచ్చేందుకు కాస్త సమయం పట్టింది.

తొలి నుంచి డిఫరెంట్ కాన్సెప్టులుండే సినిమాలను ఎంచుకుని ప్రేక్షకుల ముందుకు వస్తున్న మంచు లక్ష్మి ఎప్పట్లాగే ప్రస్తుత ప్రాజెక్టులు కూడా ఆదరణ పొందుతాయని ఆశిస్తోంది. ఫ్యామిలి ఆడియన్స్ ను తనకు మరింత దగ్గర చేస్తాయని భావిస్తోంది. మరి ఈ ‘పిలవని పేరంటం’కు ఫ్యాన్స్ వెళతారా లేదా అనేది సినిమా విడుదల అయితే తెలుస్తుంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : manchu lakshmi  pilavani perantam  budugu  

Other Articles