పేరును తిరగేసి మార్చుకున్నంత ఈజీగా ఈ అమ్మడు అబ్బాయిలను మార్చేస్తోంది. బోర్ కొడితే కొత్త సెల్ ఫోన్ తీసుకున్నంత సులువుగా.., కొత్త మగాళ్లను వెతుకుతోంది. ఒకరు కాకపోతే మరొకరు దేశంలో అమ్మాయిలకు కొరత గానీ.. అబ్బాయిలకేం అనుకుంటూ డేటింగ్ డేట్లు ఇచ్చేస్తోంది. తానిప్పటికి నలుగురితో డేటింగ్ నడిపినట్లు స్వయంగా అంగీకరిస్తోంది. భవిష్యత్తు బాగుండాలని లక్ష్మి రాయ్ నుంచి రాయ్ లక్ష్మిగా మారిన ఈ హాటు భామ యవ్యారాల గురించి స్వయంగా చెప్పుకుంది. డేటింగ్ లపై ఆసక్తి తగ్గకున్నా ఓ మచ్చ తనను వెంటాడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తోంది.
ఆ మద్య, అంటే ధోనికి పెళ్లి కాకముందు, లక్ష్మి రాయ్ - ధోని సంబంధం నడిపిన విషయం తెలిసిందే. మీడియా కంట పడకుండా అప్పట్లో వీరిద్దరూ తెగ తిరిగారనుకొండి. అనుకోని సందర్బాల్లో కెమెరాలు క్లిక్ మన్పించినా... తప్పేముంది వి ఆర్ ఇన్ రిలేషన్ అని చెప్పుకున్నారు. ఆ తర్వాత ఇద్దరి వర్క్ వర్కవుట్ కాలేదు అంతే జస్ట్ బ్రేకప్ అయ్యారు. వెంటనే ధోని బాబు పెళ్లి మిగతా లొల్లిలో పడిపోయాడు. అటు ఈ అమ్మడు కూడా మహేంద్రుడు కాకపోతే మరో మగాడు అనుకుని ఇంకొకరితో డేటింగ్ నడిపించింది.
బహిష్కరణకు గురైన క్రికెటర్ శ్రీశాంత్ తో కూడా సన్నిహితంగా ఉన్న ఫోటోలు అప్పట్లో ఇంటర్నెట్ ను హీటెక్కించాయి. ధోని తర్వాత మరో నలుగురితో డేటింగ్ చేసినట్లు రాయ్ స్వయంగా చెప్తోంది. కానీ ఆమెకు ఓ విషయం బాగా చిరాకు తెప్పించటంతో పాటు, చిలిపిగా అన్పిస్తోందట. ఆయన తర్వాత అంతమందితో ఉన్నా.., ఇప్పటికీ బయటకు వెళ్తే ధోని గురించి ప్రశ్నలు వస్తున్నాయని చెప్తోంది. ధోనితో బ్రేకప్ కు కారణాలేమిటి..? ధోని ఎలాంటి వారు..? ఇంకా ధోనితో సంబంధం ఉందా..? ఇలా బయటకు వెళ్తే చాలు క్రికెట్ ధీరుడి గురించే ప్రశ్నలు గుచ్చుకుంటున్నాయట. సామాన్య ప్రజలకు తోడుగా మీడియా కూడా రాయ్ లక్ష్మి అంటే.., ధోనిని ట్యాగ్ లైన్ గా తగిలించి వార్తలు రాస్తోందని వాపోతోంది.
‘ధోని తర్వాత నలుగురితో యవ్వారం నడిపినా వారి గురించి ఎవరూ పట్టించుకోవటం లేదు. రేపు.., భవిష్యత్తులో నాకు పిల్లలు పుడితే, వారు టీవీలో నా గురించి వచ్చే కార్యక్రమం చూసి ధోనితో సంబంధం ఏమిటి అని అడుగుతారేమో’ అంటూ రాయ్ కామెంట్ చేస్తోంది. మహేంద్రుడితో నడిపిన డేటింగ్ తన జీవితంపై మాయని మచ్చలా.., ఎప్పటికీ తొలగని మరకలా ఉంటోందని బాధపడుతోంది. ఇంతకీ అమ్మడి బాధ ఆ నలుగురూ ఎవరని పట్టించుకోలేదనా.., లేక అరిగిపోయిన రికార్డును ఎంతసేపు ప్లే చేస్తారనా?.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more