Shankar i telugu movie audio release

I movie, I telugu movie, I manoharudu, Shankar I movie, I manoharudu movie Audio launch, I manoharudu audio release photos, I manoharudu audio release chief guest, I manoharudu chief guest rajamouli, I manoharudu latest updates, I manoharudu photos, I manoharudu trailer, I manoharudu latest updates, tollywood latest updates, Upcoming telugu movies

Shankar i movie telugu audio release : south India Showman Shankar wonder I movie telugu version audio release on 30th december with SS Rajamouli as Chief Guest. I manoharudu audio release in park hotel hyderabad at evening 06-00p.m. vikram lead played I movie get huge craze in telugu states also recently released trailer attracks fans and now its time for audio release

మనోహరుడి ఆడియో విడుదల... దర్శకదిగ్గజమే ముఖ్య అతిధి

Posted: 12/30/2014 05:07 PM IST
Shankar i telugu movie audio release

సౌత్ ఇండియన్ షో మ్యాన్ శంకర్ క్రియేషన్ గా వస్తున్న ‘ఐ’ దేశ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకుంది. తెలుగులో మనోహరుడు అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ మూవీకి చాలా పాపులారిటీ ఉంది. పెద్ద పెద్ద సినిమాలు సైతం ఈ తమిళ డబ్బింగ్ మూవీని చూసి వణుకుతున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. కొద్ది రోజుల క్రితం తెలుగు వర్షన్ ట్రైలర్ విడుదల అయి మంచి రెస్పాన్స్ సంపాదించుకుంది. దీంతో ఆడియోపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాకుండా తమిళ ఆడియో రిలీజ్ కు ఆర్నాల్డ్ రావటంతో తెలుగు ఆడియో విడుదలకు జాకీచాన్ వస్తాడని ప్రచారం జరిగింది. అనివార్య కారణాల వల్ల ఇది కుదరలేదు. కానీ చివరకు తెలుగు వర్షన్ ఆడియో విడుదలకు ముఖ్య అతిధిగా టాలీవుడ్ జక్కన్న రాజమౌళిని ఆహ్వానించారు.

రాజమౌళిని ఆహ్వానించటం వెనక శంకర్ కు చిన్న ఫార్ములా ఉంది. తమిళంలో శంకర్ ఏ స్థాయిలో సినిమాలు తీస్తాడో.. తెలుగులో రాజమౌళి అదే స్థాయిలో తీయగలడు. శంకర్ ప్రస్తుతం ‘ఐ’ తెరకెక్కించగా.., జక్కన్న ‘బాహుబలి’ని డైరెక్ట్ చేస్తున్నాడు. తనలాంటి సమఉజ్జీ అయితేనే ముఖ్య అతిధి అనే పదానికి సార్ధకత చేకూరుతుందని శంకర్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. పార్క్ హోటల్ లో జరిగే ఈ ఆడియో విడుదలకు రాజమౌళి హాజరుకానున్నాడు. ‘ఐ’ విషయానికి వస్తే.., భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా జనవరి 14న విడుదల కానుంది.

విక్రమ్ మూడు విభిన్న పాత్రల్లో నటించాడు. హాలీవుడ్ బామ అమీజాక్సన్ ఇందులో హీరోయిన్ గా నటించింది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ సహా దేశంలోని ఇతర భాషల్లో ‘ఐ’ డబ్ వర్షన్ విడుదల కానుంది. అదేవిధంగా ప్రపంచ దేశాలకు చెందిన వివిధ భాషల్లో కూడా సినిమా డబ్ అయి ఒకేరోజు విడుదల అవుతోంది. ఆస్కార్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా కోసం పంపిణీదారులు భారీగా కోట్ చేస్తున్నారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : I manoharudu  SS Rajamouli  tollywood latest  

Other Articles