Thaman music for balakrishna 99 movie

Thaman for balakrishna movie, Thaman music for balakrishna movie, Balakrishna 99 movie updates, Balakrishna 99 movie music director, Balakrishna, Balakrishna movies, Balakrishna Lion movie updates, Balakrishna latest photos, Balakrishna latest Wallpapers, SS Thaman, Thaman songs, tollywood latest updates, upcoming telugu movies

thaman music for balakrishna 99 movie : tollywood young music director SS Thaman got best offer in name of balakrishna to give music for his 99th movie. Thaman to compose best tunes for balakrishna 99movie, kona venkat and gopi mohan written a best of their script for Nandamuri Hero's next movie

తమన్ కు తట్టుకోలేని ఆఫర్

Posted: 01/10/2015 04:38 PM IST
Thaman music for balakrishna 99 movie

ఎలాంటి వాడికైనా టైం కలిసి వస్తే ఎవడూ ఆపలేడు. మన పక్కనే ఉన్న వ్యక్తి కూడా ఒక్కసారిగా ఎక్కడికో వెళ్లిపోతాడు. ఉదాహరణకు తమన్ నే తీసుకొండి. డప్పుల దరువు కొడతాడు, మ్యూజిక్ డైరెక్టర్ ఎలా అయ్యాడు అని అందరూ ఎగతాళి చేస్తారు. కానీ ఆయన దరువే ఇప్పుడు బాలయ్యకు నచ్చింది. వచ్చే సినిమాలో అవకాశం ఇచ్చేలా చేసింది. అవును మీరు వింటోంది నిజమే. నందమూరి నట సింహం తీసే తర్వాతి సినిమాకు తమన్ సంగీతం అందించనున్నాడు. ఈ విషయాన్ని ఓ పత్రికతో స్వయంగా తమన్ ప్రకటించాడు.

బాలయ్య 99 సినిమాకు సంగీతం అందించే అవకాశం తనకు రావటం సంతోషంగా ఉందన్నారు. ఇండస్ర్టీకి వచ్చిన తక్కువ కాలంలో ఈ ఆఫర్ రావటంతో ఆనందం పట్టలేకపోతున్నాడు. ప్రస్తుతం రవితేజ ‘కిక్2’, రామ్ ‘పండగ చేస్కో’, సందీప్ కిషన్ ‘బీరువా’ సినిమాలకు సంగీతం అందిస్తున్న తమన్.., బాలయ్యకు ప్రత్యేక శ్రద్దతో ట్యూన్లు అందిస్తానని చెప్తున్నాడు. 99వ సినిమా విషయానికి వస్తే ఈ మూవీకి గోపి మోహన్, కోన వెంకట్ కలిసి కథ అందిస్తున్నారు. స్ర్కిప్ట్ వర్క్ పూర్తి చేసిన వీరు.., స్టోరీ చాలా బాగా వచ్చిందని ధీమాగా ఉన్నారు.

ప్రస్తుతం ‘ఎన్.బీ.కే లయన్’ సినిమాలో నటిస్తున్న బాలయ్య సీబీఐ ఆఫీసర్ గా ఇందులో కన్పించనున్నాడు. న్యూ ఇయర్ కానుకగా టీజర్ విడుదల చేసుకున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సంక్రాంతి తర్వాత ఆడియో విడుదల జరుపుకుని ఫిబ్రవరిలో సినిమా విడుదల కానుంది. 99వ మూవీ షూటింగ్ ఫిబ్రవరిలో జరుగుతుందని చెప్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Thaman  Balakrishna 99 movie  Tollywood  

Other Articles