Akkineni akhil debut shooting start date

Akkineni Akhil movie shooting start, Akkineni akhil movie, Akkineni Akhil debut, Akkineni Akhil shooting dates, Akkineni Akhil photos, Akkineni Akhil latest, Akkineni Akhil wallpapers, VV Vinayak movies, VV Vinayak akhil movie, Akkineni Akhil updates, tollywood latest, upcoming telugu movies, Nagarjuna, Akkineni Akhil, Meelo Evaru Koteeswarudu, Naga Chaitanya movies

Akkineni family's young hero Akhil all set to start acting for his debut. according to FIlm Nagar buzz VV Vinayak movie with Akhil will start shooting from 20th January 2015. still confusion on Akhil debut heroine whether Amyra Dastur or Athiya

పండగ తర్వాత హీరో బిజీ..

Posted: 01/12/2015 12:22 PM IST
Akkineni akhil debut shooting start date

అక్కినేని ఫ్యాన్స్ లోనే కాకుండా, ఫిలిం ఇండస్ర్టీలో ఎంట్రీ ఇవ్వకముందే తెగ క్రేజ్ సంపాదించిన హీరో అక్కినేని అఖిల్. సినిమా తీయకుండానే స్టార్ హీరో అయిన అఖిల్, తొలి సినిమా షూటింగ్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ లో మూవీ లాంచింగ్ చేసి, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా షూట్ మొదలు పెడతానని చెప్పారు. కానీ ఇంతవరకు ప్రారంభం కాలేదు. దీంతో ఎప్పుడు షూటింగ్ జరుగుతుందా అని అంతా ఎదురుచూస్తున్నారు. ఫ్యాన్స్ అంతా ఎగ్జైట్ మెంట్ తో ఉండగా.., ఎలాంటి ప్రకటనా చేయకుండా మూవీ ప్రి ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయట.

లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం.., ఈ సినిమాకు ఆర్టిస్టులు, ప్రధాన టెక్నిషియన్ల ఎంపిక పూర్తయిందట. సంక్రాంతి తర్వాత షూటింగ్ మొదలు పెట్టనున్నారు. జనవరి 20 నుంచి అఖిల్ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని సన్నిహితులతో స్వయంగా వినాయక్ చెప్పాడట. ఉత్తరాదికి చెందిన అమీర దస్తూర్ అఖిల్ తొలి సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్, శ్రేష్ట్ మూవీస్ బ్యానర్లు సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నాయి. అక్కినేని నాగార్జున, నితిన్ అఖిల్ సినిమాకు ప్రొడ్యూసర్లుగా వ్యవహరిస్తున్నారు.

సినిమాల్లోకి రాకముందే అఖిల్ పాపులర్ అయ్యాడు. తొలిసారి టైటాన్ యాడ్ లో నటించి అందరికి పరిచయం అయ్యాడు. సినిమాలోకి రాకముందే ఇలా యాడ్ చేసి సంచలనం కల్గించాడు. లేటెస్ట్ గా మౌంట్ ఎన్ డ్యూ కూల్ డ్రింక్ ప్రకటనలో కూడా అఖిల్ నటించాడు. ఇండస్ర్టీలోకి రాకముందే యాడ్లతో బిజీ అయిన అక్కినేని వారసుడు.., సినిమాలు మొదలు పెడితే క్షణం తీరిక లేకుండా ఉండటం ఖాయం అని టాక్ విన్పిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Akkineni Akhil  VV Vinayak  Tollywood Latest  

Other Articles