అల్లు అర్జున్ అభిమానులకు దర్శకుడు గుణశేఖర్ సంక్రాంతి కానుక ఇస్తున్నారన్న వార్తతో ఆయన అభిమాన లోకం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో.. సాంపుల్ గా న్యూలుక్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ప్రముఖ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న రుద్రమ దేవీ చిత్రంలో అల్లు అర్జున్ అత్యంత ప్రముఖ్యత వున్న గోన గన్నారెడ్డి పాత్రను పోషించారు. ఈ పాత్రకు సంబంధించి తొలి లుక్ ను విడుదల చేసిన చిత్ర దర్శక నిర్మాత.. ఇవాళ మరో న్యూ లుక్ ను విడుదల చేశారు. దీంతో గుణశేఖర్ రుద్రమ దేవిపై సినిమాపై అల్లు అర్జున్ ఫ్యాన్స్‌లో భారీగా అంచనాలు పెరిగిపోయాయి.
నలువు వర్ణం దుస్తులతో బంధిపోటు క్యారెక్టర్ కు తగ్గట్టుగా వుంది బన్నీ న్యూ లుక్. నలువు వర్ణం అశ్వం. అదే వర్ణంలో సైన్యంతో యుద్దభూమిలో పోరాటం చేస్తూ శత్రసేనల దుర్భ్యేధాన్ని చీల్చుకుంటూ గోన గన్నారెడ్డి ముందుకు కదులుతన్నట్లు వుంది న్యూ లుక్. స్టైలిష్ స్టార్ గా తనకున్న క్రేజ్ కు ఏ మాత్రం తగ్గకుండా పాత్రకు తగ్గట్టుగా వుంది బన్నీ న్యూలుక్.
గోన గన్నారెడ్డి పాత్రకు సంబంధించిన విశేషాలపై ఫ్యాన్స్ ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. అందుచేత అల్లు అర్జున్ అభిమానులకు 'రుద్రమదేవి' యూనిట్ సంక్రాంతి కానుకను అందివ్వడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో గోనగన్నారెడ్డి మేకింగ్ వీడియోను సంక్రాంతి రోజున రిలీజ్ చేయడానికి దర్శక నిర్మాతలు నిర్ణయించారు. జనవరి 15న ఉదయం 9గంటలకు సంక్రాంతి కానుకగా ఈ వీడియోను రిలీజ్ చేస్తున్నారని ఫిలింనగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా, ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం ముమ్మరంగా జరుగుతున్నాయి.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more