Kareena kapoor movie problems punjabi language udtha punjabi movie shahid kapoor

kareena kapoor news, kareena kapoor hot photos, kareena kapoor latest photo shoot, kareena kapoor gossips, kareena kapoor shahid news, kareena kapoor affairs, kareena kapoor hot gallery, kareena kapoor udta punjabi movie, udta punjabi movie news, shahid kapoor affairs, bollywood affairs, tollywood affairs

kareena kapoor movie problems punjabi language udtha punjabi movie shahid kapoor : the bollywood bebo kareena kapoor has learnt punjabi language within ten days for udtha punjabi movie in which she is pairing with ex lover shahid kapoor.

అయ్యోపాపం.. కరీనాకి ఎన్ని ‘సినిమా’ కష్టాలు!

Posted: 01/20/2015 12:39 PM IST
Kareena kapoor movie problems punjabi language udtha punjabi movie shahid kapoor

తెరపై ప్రదర్శించే మూడుగంటల చిత్రం చూడ్డాడనికి ఒక కొత్త రంగుల ప్రపంచంలా వుంటూ ప్రేక్షకుల్లో ఆహ్లాదాన్ని పెంచేవిధంగా వుంటుంది. కానీ.. తెరవెనుక ఓ చిత్రాన్ని సమకూర్చడంలో ఎన్ని కష్టాలు వుంటాయో మాటల్లో వర్ణించలేం! కార్మికుల నుంచి డైరెక్టర్, నటీనటులదాకా ప్రతిఒక్కరు కష్టాలు అనుభవించాల్సిందే! అప్పుడే సరైన ఔట్’పుట్ బయటకు వస్తుంది. ముఖ్యంగా నటీనటులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేసేందుకు ఎన్నో తంటాలు పడాల్సి వుంటుంది.

భాష నేర్చుకోవడంలోగానీ, ప్రేక్షకులను ఆకట్టుకునేలా నటనను ప్రదర్శించడంలోగానీ, యాక్షన్ సన్నివేశాల్లో నటించడంలోగానీ.. ఇలా అన్నిరకాలుగా శిక్షణ పొందిన అనంతరం తెరముందు నటించాల్సి వుంటుంది. కొందరైతే తమ వృత్తిపట్ల పూర్తిగా నిమగ్నమై తమ పాత్రకోసం ఎంతటి కష్టాన్నైనా భరించడానికి సిద్ధంగా వుంటారు. ఇలా ఇండస్ట్రీలో చాలామంది నటీనటులు వున్నారు. అందులో బాలీవుడ్ సెక్సీ బ్యూటీ కరీనా కపూర్ కూడా ఒకరు.

కరీనా తన వృత్తిపట్ల ఎంత డెడికేషన్, కమిట్’మెంట్’తో వుంటుందంటే.. తన పాత్రపోషణ కోసం నిత్యం శ్రమిస్తూనే వుంటుంది. ఏదైనా ఒక చిత్రం ఒప్పుకుందంటే.. అందులోని తన పాత్రకు న్యాయం చేయడం కోసం క్షణం తీరిక లేకుండా అందుకు కావలసిన పూర్తి అర్హతలు పొందేవరకు శిక్షణ తీసుకుంటూనే వుంటుంది. ప్రతి చిత్రంలోనూ ఏదైనా కొత్తదనం వుంటే.. దానిని పూర్తిగా నేర్చుకునేంతవరకు పట్టుదలతో వుంటుంది. ఇప్పుడు కూడా అలాగే చేసి తనను తాను నిరూపించుకుంది.

ప్రస్తుతం ఈ సెక్సీ బెబో తన మాజీ ప్రియుడుతో షాహిద్ కపూర్’తో కలిసి ‘ఉడ్తా పంజాబీ’ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ మూవీ స్ర్కిప్ట్ డిమాండ్ మేరకు ఆమె పక్కా పంజాబీ అమ్మాయిలా నటించాల్సి వుంది. దీంతో తన పాత్రను పూర్తిన్యాయం చేయడం కోసం అమ్మడు తన బాడీ లాంగ్వేజ్ మార్చుకోవడమే కాకుండా, వారి లాంగ్వేజ్ కూడా నేర్చుకుంది. అది కూడా కేవలం 10 రోజుల్లోనే నేర్చుకుని.. తన ప్రతిభను చాటుకుంది ఈ అమ్మడు.

తన తాజా మూవీ కోసం కేవలం పదిరోజుల్లోనే పంజాబీ నేర్చుకుంటానని స్నేహితులతో ధీమా వ్యక్తం చేసిన అమ్మడు.. తాను చెప్పినట్లుగానే చేసి చూపించింది. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ రజతసింగ్ దగ్గర పంజాబీ క్లాసెస్ తీసుకున్న ఈ భామ.. ఇప్పుడు ఆ భాషలో బాగా సంభాషిస్తోంది కూడా! కరీనా ప్రదర్శించిన ఈ పనితీరును చూసి బాలీవుడ్ నటీనటులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ‘బేబోనా మజాకా’!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kareena kapoor affairs  shahid kapoor affairs  udta punjabi movie news  

Other Articles