Clashes between samantha producer dil raju

samantha ruth prabhu, samantha latest news, samantha dilraju news, samantha dilraju clashes, bommarillu 2 movie, bommarillu 2 movie updates, samantha hot photo shoot, samantha gallery, samantha latest news, producer dilraju news

clashes between samantha producer dil raju : According to the tollywood sources.. samantha rejected dilraju latest movie bommarillu 2 offer. because in the past they clashes for a small reason while in movie shooting.

వీరిద్దరి మధ్య ఎక్కడో చెడింది.. ఇదేనా కారణం!!

Posted: 01/20/2015 06:15 PM IST
Clashes between samantha producer dil raju

తెలుగు చిత్రపరిశ్రమలో వుండే వారందరూ ఒక కుటుంబంలా వుంటారు. అప్పుడప్పుడు తమ మధ్య చిన్నచిన్న విభేదాలు వచ్చినప్పటికీ.. వాటిని అప్పటికప్పుడే పరిష్కరించి తిరిగి తమ స్నేహబంధాన్ని పునరుద్ధరించుకుని ముందుకు సాగుతుంటారు. అయితే ఈ సంస్కృతికి భిన్నంగా సమంత ఒక దృఢ నిశ్చయాన్ని తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఈ అమ్మడు ఏకంగా టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజుతో గొడవ పెట్టుకుని, అతనికి ‘బొమ్మ’ కనిపించేలా సమాధానం ఇచ్చిందని వార్తలు వస్తున్నాయి.

నిజానికి దిల్ రాజులాంటి నిర్మాతతో పనిచేయడానికి చిన్న తారల నుంచి స్టార్ హీరో-హీరోయిన్ల వరకు ప్రతిఒక్కరు ఆసక్తి చూపిస్తుంటారు. ఆయన నిర్మించే సినిమాల్లో నటిస్తే తమకు మంచి గుర్తింపు రావడంతోబాటు భవిష్యత్తులో మరిన్ని మంచి ఆఫర్స్ వస్తాయనే నమ్మకంతో రాజు ఫోన్ కాల్ కోసం వెయిట్ చేస్తుంటారు. మొన్నటివరకు సమంత కూడా ఆయనతో స్నేహపూర్వకంగా వుంటూ వచ్చింది. అయితే ఇంతలోనే ఏమైందో తెలియదు కానీ.. ఆయన ఇచ్చిన ఆఫర్’ను తిరస్కరించి ఘాటుగా రిప్లై ఇచ్చిందని టాలీవుడ్ టాక్!

వివరాల్లోకి వెళ్తే.. గతంలో దిల్ రాజు బ్యానర్’లో వచ్చిన ‘బొమ్మరిల్లు’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్’గా నిలిచిన విషయం తెలిసిందే! ఇప్పుడు ఆ మూవీకి సీక్వెల్’గా ‘బొమ్మరిల్లు-2’ తెరకెక్కించాలనే ప్లాన్’లో అప్పుడే ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా మొదలెట్టేశాడు రాజు! ఇందులో హీరోయిన్’గా సమంతని తీసుకోవాలని నిర్ణయించుకున్న రాజు.. తన ఆఫీస్ నుంచి ఆమెకి ఫోన్ చేయించాడు. అయితే అమ్మడు ఆ ఆఫర్’ని రిజెక్ట్ చేయడమే కాకుండా.. మరోసారి తనకు కాల్ చేయొద్దని స్ట్రిక్ట్’గా చెప్పి మరీ ఫోన్ కట్ చేసిందట!

ఈ విషయం తెలుసుకున్న రాజు.. సమంత ఎందుకలా చెప్పిందో తెలుసుకోవడం కోసం ఆమెకు ఫోన్ చేశాడట! కానీ.. అతని ఫోన్ కాల్’ని మాత్రం ఆమె ఆన్సర్ చేయడం లేదట! రెండుమూడుసార్లు ప్రయత్నించిన అనంతరం రాజు ఆగ్రహంతో ఆమెకు తిరిగి ఫోన్ చేయలేదట! ఈ వ్యవహారం ఎలాగోలా అతని ఆఫీస్ నుంచి బయటపడి ఇప్పుడు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. దీంతో ఇప్పుడిదీ హాట్ టాపిక్’గా మారిపోయింది. దిల్ రాజులాంటి బడా నిర్మాత మూవీని సమ్మూ ఎందుకు రిజెక్ట్ చేసిందంటూ సందేహాలు వ్యక్తమవడం ప్రారంభమయ్యాయి.

ఇదే విషయమై విశ్లేషించగా.. వారిద్దరి మధ్య గొడవకు గల కారణాలు బయటపడ్డాయి. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా షూటింగ్ నేపథ్యంలో సమంతకు, దిల్ రాజుకు మధ్య ఓ విషయంలో చిన్న గొడవ చోటు చేసుకుందట! ఇక ఇద్దరు కాస్త మొండిగానే వుంటారు కాబట్టి.. ఆ గొడవను కాస్త సీరియస్’గా తీసుకున్నారు. దిల్’రాజు మర్చిపోయినా.. సమంత మాత్రం అతనిపై కోపం పెంచుకుందట! అందుకే ఇప్పుడు దిల్’రాజు ఆఫర్’ని తిరస్కరించడంతోబాటు మరోసారి ఫోన్ చేయొద్దంటూ వార్నింగ్ ఇచ్చిందట! అయితే ఆ గొడవ సారంశమేంటో పూర్తిగా తెలియరాలేదు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : samantha dilraju clashes  bommarillu 2 movie updates  telugu heroines  

Other Articles