Gopichand nayanatara director b gopal movie shooting started hyderabad locations

gopichand nayanatara movie, nayanatara gopichand news, gopichand b gopal movie, gopichand latest movies, gopichand movie updates, gopichand movie photos, gopichand affairs, nayanatara movie news, nayanatara affairs, nayanatara gopi movie

gopichand nayanatara director b gopal movie shooting started hyderabad locations : the great director b gopal and gopichand movie restarted again in hyderabad which is stopped in the middle for some unwanted reasons. In this movie nayanatara pairing with gopi.

నిలిచిన నయనతారను నెట్టుకొస్తున్న గోపీచంద్.!

Posted: 01/21/2015 01:36 PM IST
Gopichand nayanatara director b gopal movie shooting started hyderabad locations

ప్రస్తుతరోజుల్లో నటుడు గోపీచంద్’కి లక్ బాగానే కలిసొస్తున్నట్లుగా కనిపిస్తోంది. అప్పుడెప్పుడో కొన్ని కారణాల వల్ల నయనతారతో విడిపోయిన బంధాన్ని ఇతగాడు మళ్లీ కొనసాగించడానికి సన్నద్ధమయ్యాడు. అయితే ఇది రియల్ లైఫ్’లో జరిగిన ఇన్సిడెంట్ అయితే కాదులెండి.. రీల్ లైఫ్’లో!

‘లౌక్యం’ మూవీ సక్సెస్’తో ఫుల్ జోష్ మీదున్న గోపీచంద్.. ప్రస్తుతం ‘జిల్’ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే! ఇక దీంతోపాటు గతంలో ఆగిపోయిన మరో మూవీ షూటింగ్ కూడా తాజాగా ప్రారంభం అయ్యింది. బి.గోపాల్ దర్శకత్వంలో నయనతార, గోపీచంద్ జంటగా ఓ మూవీ తెరకెక్కుతున్నట్లు గతంలో వార్తలొచ్చిన సంగతి తెలిసిందే! అయితే కొన్ని కారణాల వల్ల ఆ మూవీ మధ్యలోనే అర్థంతరంగా ఆగిపోయింది. ఇప్పుడు ఆ సమస్యలు సమసిపోవడం వల్ల తిరిగి ఆ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యింది. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ హైదరాబాద్’లో జరుగుతోంది.

గోపీచంద్, ప్రకాష్ రాజ్’లతోబాటు ఇతర ప్రధాన తారాగణంతో కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. సోమవారం రోజు రామోజీ ఫిల్మ్ సిటీలో సోమవారం హాస్పిటల్ సన్నివేశాలను చిత్రీకరించారు కూడా! కమర్షియల్ అంశాలతో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్’గా తెరకెక్కుతున్న ఈ మూవీలో గోపీచంద్ నటించిన యాక్షన్ సీన్లు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకునేలా వుంటాయని మూవీ బృందం తెలుపుతోంది. ముఖ్యంగా ఈ చిత్రంలో ప్రేమకథకు అధిక ప్రాముఖ్యత వుంటుందని, గోపీ-నయనల మధ్య రొమాంటిక్ సన్నివేశాలు చాలా బాగుంటాయని దర్శకనిర్మాతలు వెల్లడిస్తున్నారు.

కొమర వెంకటేష్ సమర్పణలో జయ బాలాజీ రియల్ మీడియా పతాకంపై తాండ్ర రమేష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. పిబ్రవరి చివరిలోగా షూగింగ్ ముగించుకుని, త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gopichand  director b gopal  nayanatara news  hyderabad city  

Other Articles