బాలీవుడ్ సినిమాలకు ప్రభుత్వం కాకుండా ప్రైవేటుగా లభించే అత్యంత ప్రతిష్టాత్మకంగా అందించే అవార్డులలో 60 వసంతాలను నింపుకున్నా ఇప్పటికీ నిత్య నూతనంగా అవార్డుల ప్రధానం చేస్తున్న ఏకైక సంస్థ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్. జాతీయ అవార్డుల తర్వాత అంతటి స్థాయి వున్న అవార్డులుగా ప్రఖ్యాతి చెంది.. అవార్డుల విషయంలోనూ అన్ని అంశాలను బేరిజు వేసుకుని ప్రకటించే సంస్థ ఫిల్మ్ ఫేర్. 2014లో విడుదలైన బాలీవుడ్ సినిమాలకు గానూ అవార్డులను ప్రదానం చేశారు. ఈ అవార్డుల్లో విమర్శకుల ప్రశంసల పరంగానూ, బాక్సాఫీస్ పరంగానూ ఘన విజయం సాధించిన 'క్వీన్', ఫిల్మ్ ఫేర్ అవార్డులలోనూ తన అధిపత్యాన్ని కోనసాగించింది.
క్వీన్ తరువాత అదే స్థాయిలో అవార్డులను అందుకుని ప్రేక్షకుల మన్ననలను అందుకున్న చ'హైదర్' సినిమా సత్తా చాటింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి విభాగాల్లో అవార్డులతో పాటు మొత్తం 6 అవార్డులను సొంతం చేసుకొని, క్వీన్ నిజంగానే క్వీన్‌గా నిలబడింది. ఇక హైదర్ విషయానికి వస్తే.. ఉత్తమ నటుడి విభాగంలో అవార్డుతో పాటు మొత్తం 5 అవార్డులను సొంతం చేసుకుందీ సినిమా.
ఆమీర్ ఖాన్, రాజ్‌కుమార్ హిరాణీల తాజా సంచలనం పీకే.. ఉత్తమ స్క్రీన్‌ప్లే, ఉత్తమ సంభాషణల విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకొంది. ఇక గతేడాది విడుదలైన చెప్పుకోదగ్గ సినిమాల్లో మొదటి వరుసలో ఉన్న హైవే సినిమాకు గానూ, ఆలియాభట్, ఉత్తమ నటి (క్రిటిక్స్ క్యాటగిరీ) అవార్డును సొంతం చేసుకున్నారు. అలనాటి మేటి నటి కామిని కౌషల్.. జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more