Rakul preet or rashi khanna for jr ntr s next

Jr.NTR, Tarak, young tiger jr.ntr, tarak hit movies, tarak latest movies, tarak new photos, tarak latest updates, tarak latest news, tarak matest movie news, Rakul Preet singh latest photos, Rakul Preet singh latest news, Rakul Preet singh latest movies, Rashi Khanna latest movies, Rashi Khanna latest news, Rashi Khanna latest news, Hansika latest news, hansika latest movies, Hansika latest updates, Hansika new photos, Sukumar latest movies, sukumar latest news, sukumear latest updates

As 'Temper' is close to release date , Jr.NTR is busy wrapping up things for his next movie.

తారక్ తో కెమిస్ట్రీకి సై అంటున్న ఇద్దరు అందాల బామలు

Posted: 02/08/2015 11:45 AM IST
Rakul preet or rashi khanna for jr ntr s next

టెంపర్ సినిమా టీజర్, ట్రైలర్ లతో హీట్ లేపుతున్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టియార్.. ఆ చిత్రం త్వరలో విడుదల కానుండడంతో మరో ప్రాజెక్టులో బిజీగా మారారు. అయితే ఈ కోత్త ప్రాజెక్టులో తారక్ పక్కన స్ర్కీన్ ను షేర్ చేసుకునేది ఎవరన్న అంశం ఇప్పడు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే యంగ్ డైరెక్టర్ సుకుమార్ తో మరో కొత్త ప్రాజెక్టు చేస్తున్నారన్న వార్తల నేపథ్యంలో తారక్ పక్కన ఎవరు నటిస్తున్నారన్నది చర్చనీయాంశంగా మారింది.

యంగ్ టైగర్ తో కలసి కంత్రి సినిమాలో నటించిన అందాల ముద్దుగుమ్మ హన్సికకు తారక్ పక్కన నటించేందుకు చాన్స్ లభించిందని సినీవర్గాల టాక్. కాగా, ఈ చిత్రంలో మరో హీరోయిన్ పాత్రకు ఎవరిని తీసుకోవాలా అని డైరెక్టర్ సుకుమార్ వేట కొనసాగిస్తున్నారట. ప్రస్తుతానికి ఇద్దరు హీరోయిన్ల పేర్లు ప్రతిపాదనకు రాగా, వారిలో ఎవరినీ అదృష్టం వరించనుందో..? వాళ్లెవరంటారా..? వరుస హిట్లతో దూసుకుపోతున్న రాశీ కన్నా ఒకరు కాగా, మంచి అభినయానికి కేరాఫ్ అడ్రస్ గా మారి చిన్న సినిమాలతో పెద్ద హీరోయిన్ గా మారిన రుకుల్ ప్రీత్ సింగ్ మరోకరు.

వీరిద్దరిలో ఎవరికి తారక్ పక్కన నటించే అవకాశం లభించనుందో వేచి చూడాలి. అయితే అదుర్స్ తరువాత యంగ్ టైగర్ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు. కథ, కథనం మేరకు తాజా చిత్రంలో ఇద్దరు హీరోయిన్లతో స్ర్కీన్ పై జూనియర్ ఎన్టియార్ మంచి కెమిస్ట్రీ పండిస్తారని సినివర్గాల భోగట్టా. సుకుమార్ డైరెక్షన్ లోని తాజా చిత్రం కూడా అదుర్స్ మాదిరిగా హిట్ కావాలని తారక్ అభిమానులు కోరుకుంటున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jr ntr  Rakul Preet  Rashi Khanna  Hansika  sukumar  

Other Articles