Rudramadevi television satelite rights anushka shetty allu arjun rana daggubati gunasekhar

rudramadevi movie news, rudramadevi satelite rights, anushka shetty, allu arjun news, rana daggubati news, director guna sekhar news, anushka shetty hot photos, anushka shetty sexy photos, anushka latest news, rudramadevi shooting stills, rudramadevi movie stills

rudramadevi television satelite rights anushka shetty allu arjun rana daggubati gunasekhar : A famous telugu tv channel bags rudramadevi satelite rights with huge amount of 8.5 crores.

రిలీజ్ కాకముందే బుల్లితెరపై దుమ్మురేపింది..?

Posted: 02/19/2015 05:25 PM IST
Rudramadevi television satelite rights anushka shetty allu arjun rana daggubati gunasekhar

టాలీవుడ్ బొమ్మాళి అనుష్క టైటిల్ రోల్ లో నటిస్తున్న ‘రుద్రమదేవి’ చిత్రం ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఇప్పటికీ ట్రైలర్ కూడా విడుదల కాలేదు. కానీ.. అప్పుడే ఈ చిత్రం బుల్లితెరపై సంచలనం సృష్టిస్తోంది. దీంతో ఇండస్ట్రీలో వున్నవారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. విడుదలకాకముందే ఈ మూవీ ఇలా సంచలనం సృష్టిస్తుంటే.. విడుదలైన తర్వాత ఇంకెంతో దుమ్మురేపుతుందోనన్న సందిగ్ధతలో పడిపోయారు.

వివరాల్లోకి వెళ్తే.. కాకతీయ సామ్యాజ్యానికి చెందిన రాణి ‘రుద్రమదేవి’ జీవితకథ ఆధారంగా ధర్శకుడు గుణశేఖర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం రిలీజ్ కాకముందే భారీ క్రేజ్ మూటగట్టుకుంది. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్స్ లకు మంచి స్పందన లభించింది. ఈ మూవీ ప్రోమోలు కూడా అందిరినీ ఆకట్టుకున్నాయి. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు పెరిగాయి. ఈ చిత్రానికి ఇంత క్రేజ్ రావడం వల్ల విడుదలకు ముందే దీని శాటిలైట్ రైట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఎవరూ ఊహించని రీతిలో ఓ ఛానెల్ భారీ మొత్తంలో వెచ్చించిమరీ దీని హక్కుల్ని కైవసం చేసుకుంది.

తాజాగా ఓ ప్రముఖ ఛానెల్ 8.5 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ మూవీ శాటిలైట్ రైట్స్ కొనుక్కుందని సమాచారం! దీంతో ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. లేడీ ఓరియెంటెడ్ చిత్రం ఈ రేంజిలో రైట్స్ అమ్ముడుపోవడం నిజంగానే ఆశ్చర్యకరమని అంటున్నారు. అయితే.. ఇందులో రానా, అల్లు అర్జున్ లాంటి స్టార్ క్యాస్ట్ వుండటంతో ఈ చిత్రానికి ఇంత క్రేజ్ వచ్చిందని, అందుకే రైట్స్ మంచి రేటుకు అమ్ముడుపోయాయని అంటున్నారు. ఏదైతేనేం.. ఈ చిత్రం విడుదల కాకముందే నిర్మాతలకు ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rudramadevi movie news  anushka shetty  allu arjun  rana daggubati  guna sekhar  

Other Articles