Jagapathi babu manchu manoj ram gopal varma golusu movie updates

jagapathi babu, manchu manoj news, ram gopal varma news, gayam movie news, current theega, jagapathi babu manchu manoj, jagapathi babu villain role, ram gopal varma twitter, golusu movie updates

jagapathi babu manchu manoj ram gopal varma golusu movie updates : Jagapathi babu playing a powerful villain character in golusu movie which is to be directed by controversial director ram gopal varma. Manchu Manoj playing in lead role in the movie.

జగపతితో వర్మ ఓకే అంటే.. మనోజ్ గొడవపడుతున్నాడు!

Posted: 02/20/2015 03:32 PM IST
Jagapathi babu manchu manoj ram gopal varma golusu movie updates

‘లెజెండ్’ సినిమాతో తన విలనిజాన్ని నిరూపించుకున్న ఒకప్పటి హీరో జగపతిబాబు.. ఆ తరహా రోల్స్ చేసుకుంటూ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు. కేవలం పవర్ ఫుల్ విలన్ పాత్రలు పోషించడమే కాదు.. నెగెటివ్ షేడ్స్ వున్న కామెడీ రోల్స్ కూడా చేస్తున్నాడు. సీనియర్ హీరోలతోపాటు యంగ్ హీరోలు కూడా ఆయనే కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దీంతో వచ్చిన అవకాశాలను కాదనుకుండా అందరి మూవీల్లోనూ ప్రతినాయకుడి పాత్రలు పోషిస్తున్నాడు. మొత్తానికి ఒక్కమాటలో చెప్పాలంటే.. ప్రతినాయక పాత్రలకు పెద్దదిక్కులా జగపతి కనిపిస్తున్నాడన్నమాట!

ఇక విషయానికొస్తే.. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో మనోజ్ ఒక ప్రాజెక్ట్ ని అంగీకరించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ప్రతినాయక పాత్రకోసం జగపతిబాబును సంప్రదించగా.. ఆయన వెంటనే ఒప్పుకున్నాడని సమాచారం! ఈ చిత్రంలో విలన్ క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్ గా వున్న నేపథ్యంలో ఆయన్నే తీసుకున్నారని, అందుకు ఆయన కూడా ఓకే అన్నారని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో మంచు మనోజ్ ఈ మూవీతో మరోసారి జగపతిబాబును ఢీకొట్టనున్నాడన్నమాట! (వీరిద్దరు ఇదివరకే ‘కరెంట్ తీగ’ సినిమాలో నటించిన విషయం అందిరికీ తెలిసిందే)

ఇకపోతే.. వర్మతో జగపతి ఇదివరకే ‘గాయం’ అనే చిత్రంలో నటించిన విషయం విదితమే! ఆ మూవీ అప్పట్లో ఇద్దరికీ మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈసారి కూడా అలాగే జరుగుతోందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది యూనిట్ బృందం! ఇక ఈ సినిమాకు ‘గొలుసు’ అనే టైటిల్ ని దాదాపుగా ఖరారు చేసినట్లు సమాచారం!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jagapathi babu updates  ram gopala varma news  manchu manoj movies  

Other Articles