Shraddha kapoor pop singer britney spears bollywood news

shraddha kapoor latest news, shraddha kapoor pop star, shraddha kapoor britney spears, britney spears songs, britney spears hot photos, britney spears album. shraddha kapoor hot photos, shraddha kapoor hot photo shoot, shraddha kapoor interview, shraddha kapoor press meet

shraddha kapoor pop singer britney spears bollywood news : Shraddha kapoor shares her feelings that If she is not became an actress she will be a pop star singer.

శ్రద్ధాకపూర్ కి తీరని చిరకాల వాంఛ...

Posted: 02/21/2015 01:08 PM IST
Shraddha kapoor pop singer britney spears bollywood news

ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ కాలంలోనే నటిగా మంచి గుర్తింపు పొందిన నటీమణుల్లో శ్రద్ధకపూర్ ఒకరు! ఒక స్టార్ విలన్ కుటుంబం నుంచి వారసురాలిగా పరిశ్రమలోకి వచ్చిన ఈమెకు ఎటువంటి కొదవ లేదు! నటిగా, అమ్మాయిగా జీవితాన్ని బాగానే ఆస్వాదిస్తోంది. అయితే.. ఇండస్ట్రీలోకి రావడం వల్ల స్టార్ హోదా అయితే సొంతం చేసుకుంది కానీ.. తన చిరకాల వాంఛను మాత్రం తీర్చుకోలేకపోయానని వాపోతోంది. తాను అసలు పరిశ్రమలోకి రాకుండా వుండుంటే తన కోరికను తీర్చుకునేదాన్నని, కానీ అది సాధ్యపడలేదని చెబుతోంది.

తాను హీరోయిన్ కాకుండా వుండుంటే పాప్ స్టార్ అయ్యేదానన్నని చెబుతోంది శ్రద్ధ! చిన్నప్పటినుంచే తనకు సింగర్ అవ్వాలన్న ఆశ వుండేదని, కానీ సినిమాల్లోకి రావడం వల్ల అది కుదరలేదని అంటోంది. ‘ఒకవేళ నేను నటి కాకపోయి వుండుంటే పాప్-సింగర్ అయ్యేదాన్ని. ఎందుకంటే.. చిన్నప్పటి నుంచి బ్రిట్నీ స్పియర్స్ ను చూస్తూ పెరిగా. ఆ ప్రభావం నా మీద చాలా వుంది. ఆమెలాగే నేను సింగర్ అవ్వాలనుకున్నా. కానీ కుదరలేదు’’ అంటూ చెబుతోంది అమ్మడు. ఈమె పాప్ స్టార్ అయితే కాలేకపోయింది కానీ.. సినిమాల్లో మాత్రం పాటలు పాడుతూ సింగర్ అవ్వాలన్న తన కోరిక తీర్చుకుంటోందిలెండి!

ఇదిలావుండగా.. త్వరలోనే శ్రధ్దా ఫ్యాషన్ రంగంలోకి ప్రవేశనుందని వార్తలొస్తున్నాయి. ఇప్పటికాలానికి అనుగుణంగా ‘ఇమారా’ పేరుతో ఈమె దుస్తులు రూపొందనుందని బాలీవుడ్ వర్గాల సమాచారం! అంటే.. బిజినెస్ రంగంలోకి కూడా ఈమె ప్రవేశించనుందన్నమాట!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : shraddha kapoor pop singer  britney spears news  bollywood news  

Other Articles