Anushka shetty size zero movie schedule stars pvp cinemas banner prakash kovelamudi

anushka shetty latest news, anushka shetty size zero, anushka shetty zero size movie, anushka size zero, anushka shetty movies, anushka bahubali, anushka rudramadevi, producer potluri v prasad, director prakash kovelamudi, PVP Cinemas Anushka Movie

anushka shetty size zero movie schedule stars pvp cinemas banner prakash kovelamudi : Anushka Shetty new film size zero shooting starts in hyderabad which is directed by prakash kovelamudi and produced by potluri prasad on pvp cinemas banner

అనుష్క ‘సైజ్ జీరో’ మొదలయ్యింది..!

Posted: 02/23/2015 05:10 PM IST
Anushka shetty size zero movie schedule stars pvp cinemas banner prakash kovelamudi

సాధారణంగా ‘సైజ్ జీరో’ అంటే.. కథానాయికలు తమ కడుపు కాల్చుకుని, నడుమును బక్కపల్చగా మార్చుకోవడమని అనుకుంటారు. కానీ.. ఇక్కడ అనుష్క అలాంటి వర్కౌట్స్ అయితే చేయడం లేదులెండి! ఆమె తాజాగా నటించబోయే చిత్రానికి ‘సైజ్ జీరో’ అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు సమాచారం!

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తనయుడు, ‘అనగనగా ఓ ధీరుడు’ సినిమా దర్శకుడు ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో అనుష్క ప్రధానపాత్రలో సినిమా చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చిన సంగతి విదితమే! ఆ మూవీ షూటింగ్ సోమవారం (23-02-2015) హైదరబాదులో పూజాకార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో అనుష్కపై చిత్రీకరించిన తొలి షాట్ కు చిత్ర రచయిత్రి, దర్శకుడు ప్రకాష్ భార్య కనికా ధిల్లాన్ క్లాప్ ఇవ్వగా.. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ పివిపి సినిమాస్ పతాకంపై నిర్మిస్తున్న పొట్లూరి వి ప్రసాద్ భార్య కెమెరా స్విచాన్ చేశారు. ఇక దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు.

‘బాహుబలి’, ‘రుద్రమదేవి’ వంటి భారీ ప్రతిష్టాత్మక చిత్రాల తర్వాత అనుష్క నటిస్తున్న మరో భారీ బడ్జెట్ ఫాంటసీ చిత్రమిది! ఇందులో లావుగా కనిపించడం కోసం అనుష్క తన బరువును దాదాపు వందకేజీలకు పెంచుతుందని అంటున్నారు. యూనిట్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ చిత్రాన్ని ఓ ప్రముఖ నవల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. కథ, కథనాలు చాలా ఆసక్తికరంగా వుంటాయని వెల్లడిస్తున్నారు. యం.యం.కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెలలో మొదలవుతుందని సమాచారం! ఇందులో శృతిహాసన్ ప్రత్యేక పాత్రలో నటించనుందని యూనిట్ బృందం తెలుపుతోంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : anushka shetty size zero movie  pvp prakash kovelamudi  tollywood news  

Other Articles