Hansika motwani europe trip details

hansika motwani latest news, hansika motwani europe trip, hansika motwani dolphin photos, hansika motwani hot photo shoot, hansika motwani hot stills, hansika motwani trip, hansika motwani children, hansika motwani twitter

hansika motwani europe trip details : Hansika motwani expressed her feelings about europe trip that she enjoyed a lot their. Especially the kissing scene with dolphins is her best moment.

మరువలేని అనుభూతిని పొందిన హన్సిక!

Posted: 02/24/2015 12:49 PM IST
Hansika motwani europe trip details

గతకొంతకాలం నుంచి వరుసగా సినిమాలు చేసుకుంటూ, ఎడతెరిపి లేకుండా షూటింగుల్లో పాల్గొన్న బొద్దుగుమ్మ హన్సిక.. ఇప్పుడు కాస్త విరామం తీసుకుంది. షూటింగుల్లోనే ఇన్నాళ్లూ బిజీగా గడిపిన ఈ అమ్మడు.. కాస్త ఎంజాయ్ చేద్దామన్న ఉద్దేశంతో తనకెంతో ఇష్టమైన యూరప్ ట్రిప్ కి చెక్కేసింది. అక్కడున్న ప్రకృతి అందాల్లో విహరిస్తూ హ్యాపీగా కాలం గడిపింది. అక్కడున్న సముద్రజలాల ప్రాంతాల్లో డాల్ఫిన్స్, పెంగ్విన్ లతో ముద్దాడుతూ బాగానే ఎంజాయ్ చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ ట్రిప్ లో తాను పొందిన అనుభూతిని మరువలేనిదంటూ హన్సిక తెలుపుతోంది. రెండోసారి యూరప్ ట్రిప్ కి వెళ్లిన ఈ అమ్మడు.. మొదటిసారికంటే ఈ ట్రిప్ నే ఎంతో ఎంజాయ్ చేశానంటోంది.

‘‘నా ఈ ట్రిప్ లో అద్భుతమైన అనుభవం ఏమిటంటే.. డాల్ఫిన్ లను ముద్దాడడం. ఈ అనుభూతిని జీవితంలో మరిచిపోలేను’’ అంటూ ట్వీట్ చేస్తూ.. ఆ ఫోటోలను కూడా పోస్ట్ చేసింది హన్సిక! మొత్తానికి తాను ఈ ట్రిప్ లో బాగానే ఎంజాయ్ చేశానంటూ అందరితోనూ తన ఆనందాన్ని పంచుకుంటోందట! ఇక అక్కడి నుంచి రాగానే మళ్లీ తన మూవీ షూటింగుల్లో నిమగ్నమైంది! ఇదిలావుండగా.. ఈ షూటింగులు ముగిసిన అనంతరం ఈమె తాను దత్తత తీసుకున్న చిన్నారులను తీసుకుని ఇండియాలోని లోనవాలా ట్రిప్ కి వెళ్తుందని హన్సిక క్లోజ్ ఫ్రెండ్ ఒకరు తెలుపుతున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hansika motwani europe trip  hansika twitter  tollywood heroines  

Other Articles