Simran trisha illana nayanatara movie updates

simran news, simran latest news, simran tamil news, simran second innings, trisha illana nayanatara, trisha illana nayanatara movie updates, simran latest movie updates, trisha illana nayanatara movie, kollywood news

simran trisha illana nayanatara movie updates : Actress simran has confirmed that she is doing an important role in trisha illana nayanatara movie which is to be directed by adhik ravichandran. Jeevi prakash kumar is leading hero in this movie.

‘త్రిష లేదా నయనతార’ అంటున్న సిమ్రన్..

Posted: 02/24/2015 03:43 PM IST
Simran trisha illana nayanatara movie updates

ఒకప్పుడు తెలుగు, తమిళ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన నటి సిమ్రన్.. తన పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరమైపోయింది. అప్పుడప్పుడు సినిమాల్లో గెస్ట్ పాత్రల్లో కనిపించింది కానీ.. అవి ఆమెకు అంతగా గుర్తింపు తెచ్చిపెట్టలేదు. నాని హీరోగా తెరకెక్కిన ‘అహ కళ్యాణం’ చిత్రంలో చివరిసారిగా కనిపించిన ఆమె.. ఆ తర్వాత అడ్రస్ లేకుండా పోయింది. అయితే.. ఇప్పుడు తాజాగా ‘త్రిష లేదా నయనతార’ అంటూ ఆమె తెరమీదకొచ్చింది.

వివరాల్లోకి వెళ్తే.. తమిళంలో జీవి ప్రకాష్ కుమార్ హీరోగా ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ‘త్రిష ఇల్లానా నయనతార’ (త్రిష లేదా నయనతారా) పేరిట ఓ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలోనే ఓ ఇంపార్టెంట్ పాత్రలో నటి సిమ్రన్ నటించనుంది. ఈ విషయాన్ని స్వయంగా సిమ్రన్ ధ్రువీకరించింది కూడా! ముందుగా తనకు ఈ మూవీ టైటిల్ బాగా ఆకర్షించింది.. అనంతరం దర్శకుడు వినిపించిన కథ, తన పాత్ర బాగా నచ్చడంతో మూవీలో నటించేందుకు ఒప్పుకున్నట్లు తెలిపింది.

‘‘అసలు ముందుగా ఈ సినిమా టైటిల్ నన్ను బాగా ఆకర్షించింది. అందుకే ఈ మూవీ కథ విన్నాను. కథ వింటున్నప్పుడు నా క్యారెక్టర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. అలాగే కథ కూడా చాలా బాగుంది. దాంతో ఈ సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నాను’’ అని స్పష్టం చేసింది సిమ్రన్! ఇదిలావుండగా.. ఇందులో సిమ్రన్ అల్ట్రామోడరన్ లుక్కులో కనిపించనుందని యూనిట్ వర్గాలు తెలుపుతున్నాయి. మొత్తానికి సిమ్రన్ భారీగా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించనుందన్నమాట!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : simran latest news  trisha illana nayanatara movie updates  tamil movies  

Other Articles