Krish varun tej kanche movie launched

Krish Varun Tej Kanche Movie Launched, Varun Tej Krish Movie Launched, Varun Tej Krish Movie started, Varun Tej Krish Movie title Kanche, Varun Tej Movie title Kanche, varun tej next movie with krrish, Varun Tej movie news, Varun Tej movie details, Varun Tej news, Varun Tej mukunda news

Krish Varun Tej Kanche Movie Launched: Varun tej krish movie launched today morning. Mega hero Varun Tej new movie under Krish Direction. Rajeev reddy producer. movie title is Kanche.

వరుణ్ టైటిల్ కంచె ఫిక్స్... ముహూర్తం

Posted: 02/27/2015 10:13 AM IST
Krish varun tej kanche movie launched

‘గమ్యం’, ‘వేదం’, ‘కృష్ణం వందే జగద్గురుమ్’ వంటి విభిన్న చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు క్రిష్ (జాగర్లమూడి రాధాకృష్ణ)... ఈసారి మెగా హీరో వరుణ్ తేజ్ తో లవ్, రొమాంటిక్, యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడని సమాచారం.

‘ముకుంద’ సినిమా తర్వాత వరుణ్ తేజ తన రెండవ చిత్రాన్ని క్రిష్ దర్శకత్వంలో చేయనున్న విషయం అందరికి తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో వరుణ్ హీరోగా తెరకెక్కనున్న సినిమా ముహూర్తపు కార్యక్రమాలు ఈరోజు ఉదయం జరిగాయి. ఈ చిత్రానికి ‘కంచె’ అనే టైటిల్ ఖరారు చేసారు.

Kanche

ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్లో నిర్మాత రాజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో వరుణ్ సరసన ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా నటించనుంది. ఈ సినిమా మొత్తం 1940 టైంలో అనగా స్వాతంత్ర్యం రాక ముందునాటి కాలంలో జరుగుతుందని తెలిసింది. మరికొద్ది గంటల్లో ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Varun Tej  Director Krish  Kanche  movie Launch  muhurtham  stills  Tollywood  Movie News  

Other Articles