Telugu anchor shilpa chakravarthy love story college life

shilpa chakravarthy news, shilpa chakravarthy hot news, shilpa chakravarthy hot photos, shilpa chakravarthy photo shoot, shilpa chakravarthy latest updates, shilpa chakravarthy anchoring, shilpa chakravarthy love affairs, shilpa chakravarthy affairs, shilpa chakravarthy love story

telugu anchor shilpa chakravarthy love story college life : Anchor shilpa chakravarthy shares her college love days where two boys fought for her love.

యాంకర్ కోసం కొట్టేసుకున్న ఇద్దరు ప్రేమికులు!

Posted: 03/02/2015 03:33 PM IST
Telugu anchor shilpa chakravarthy love story college life

ఇటీవలే బుల్లితెర యాంకర్ల హవా బాగానే కొనసాగుతోంది. ఈ యాంకర్లు తమ మాటలతో ఫ్యామిలీ ఆడియెన్స్ ని మాయ చేయడమే కాకుండా అందచందాలతోనూ యూత్ ని కట్టిపడేస్తున్నారు. అందుకే.. వీరికి ఫాలోయింగ్ భారీగా పెరుగుతోంది. ఈ విధంగా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న యాంకర్లలో శిల్పా చక్రవర్తి ఒకరు! నిజానికి ఈమె మాతృభాష తెలుగు కాకపోయినప్పటికీ పట్టుబట్టి మరీ తెలుగు నేర్చుకుంది. అనంతరం తాను ఎంతగా ఇష్టపడే యాంకరింగ్ ఫీల్డ్ లోకి వచ్చేసింది. అలా కెరీర్ ప్రాంభించిన ఆమె.. తన అందచందాలతో, మాటలతో అందరినీ కట్టిపడేస్తూ కొన్నిరోజుల్లోనే బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

శిల్పా ఫాలోయింగ్ ఎంతగా పెరిగిపోయిందంటే.. ఈమెతో కలిసి కనీసం ఒక్క ఫోటో అయినా దిగాలంటూ యూత్ ఉర్రూతలూగుతుంటుంది. మరికొందరైతే లవ్ ప్రపోజల్స్ తో ఈమె వెంటబడుతుంటారు. అంతటి పాలోయింగ్ వున్న ఈమెను ఇద్దరు యువకులు ప్రేమిస్తున్నామంటూ బాగానే కొట్టేసుకున్నారట! ‘నేను ప్రేమిస్తున్నానంటే లేదు నేనే ప్రేమిస్తున్నాను’ అంటూ, ‘ఆమె నాకే దక్కుతుందని’ చెబుతూ పోటీపడిమరీ దొబ్బులాడుకున్నారట! ఈ విషయాన్ని స్వయంగా శిల్పాయే వెల్లడిస్తోంది. అయితే.. ఆ ఘటన జరిగింది ఇప్పుడు కాదులెండి.. తను కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లో జరిగిందని ఆమె స్పష్టం చేసింది.

శిల్పా చక్రవర్తి కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లో.. ఓ ఇద్దరు కుర్రాళ్లు తన వెంటపడేవారట! అయితే తాను మాత్రం వాళ్లతో ఫ్రెండ్లీగానే వుండేదాన్నని చెబుతోంది. అయితే.. తనకు తెలియకుండా ఆ కుర్రాళ్లు మాత్రం ప్రేమించేవారట! కొన్నాళ్ల తర్వాత ఆ ఇద్దరు అబ్బాయిలు శిల్పానే ప్రేమిస్తున్నట్లు తెలిసిందట! దాంతో ఆమెను ‘నేను ప్రేమిస్తున్నానంటే నేను ప్రేమిస్తున్నాను’ అంటూ కాలేజీ గ్రౌండ్ లో కొట్టుకున్నారట! అయితే.. తాను మాత్రం వారిద్దరి నుంచి దూరంగా వుంటూ వచ్చానని అమ్మడు వెల్లడిస్తోంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : shilpa chakravarthy love story  telugu anchors affairs  tollywood news  

Other Articles