Raghava lawrence kanchana 2 movie first look released tapsee pannu nitya menon

kanchana 2 first look, kanchana 2 movie updates, kanchana 2 movie news, raghava lawrence news, raghava lawrence kanchana 2, kanchana 2 movie trailer, kanchana 2 movie photos, kanchana 2 first look photos, tapsee pannu, tapsee pannu news, tapsee pannu kanchana 2, nitya menon news, nitya menon kanchana 2

raghava lawrence kanchana 2 movie first look released tapsee pannu nitya menon : Dancer cum director raghava lawrence latest flick kanchana 2 movie first look has released. In this movie tapsee pannu pairing with raghava and nitya menon playing a special role.

విడుదలైన ‘కాంచన-2’ ఫస్ట్ లుక్..

Posted: 03/14/2015 11:39 AM IST
Raghava lawrence kanchana 2 movie first look released tapsee pannu nitya menon

ప్రముఖ డ్యాన్సర్ - దర్శకుడు రాఘవ లారెన్స్ దర్శకత్వంలో తాజాగా ‘కాంచన-2’ చిత్రం తెరకెక్కుతోంది. గతంలో వచ్చిన ‘కాంచన’కు సీక్వెల్ అయిన ఈ మూవీలో హీరోయిన్ గా పంజాబీ భామ తాప్సీ నటిస్తోంది. గతేడాది తొలినాళ్లలో ప్రారంభమైన ఈ మూవీ షూటింగ్ దాదాపు చివరి స్టేజీకి వచ్చేసింది. ఇప్పటికే ఎక్కువ ఆలస్యం కావడంతో ఈ మూవీ షూటింగ్ త్వరగా కంప్లీట్ చేసి, ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ ని యూనిట్ విడుదల చేసింది.

మొత్తం పసుపుపచ్చరంగులో వున్న ఈ ఫోటోలో.. ఒకవైపు చేతినిండా గాయాలు, మరోవైపు భక్తుడి రూపంలో రాఘవ లారెన్స్ కనువిందు చూశాడు. ఈ ఫోటో విడుదలైన కొద్దిసేపటికే నెటిజన్ల నుంచి మాంచి స్పందన వస్తోంది. గత చిత్రం కంటే ఈ మూవీ మరింత థ్రిల్లింగ్ గా వుంటుందని కోలీవుడ్‌లో ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. ‘కాంచన’ తర్వాత లారెన్స్ తీసిన సినిమాలు డిజాస్టర్ కావడంతో అతని ఇమేజ్ కాస్త దెబ్బతింది. దీంతో ఈ మల్టీ టాలెంటడ్ హీరో ఈ మూవీపై ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నాడు. సినిమాలోని ప్రతీ సీన్ పర్ ఫెక్ట్ గా వుండాలనే ఉద్దేశంతోనే షూటింగ్ ఆలస్యమవుతోందని తెలుస్తోంది. హారర్ కామెడీగా రానున్న ఈ ప్రాజెక్ట్ కోసం ఆయన హార్డ్‌ వర్క్ చేసినట్టు యూనిట్ సభ్యులు చెబుతున్నారు.

kanchana-2

ఇదిలావుండగా.. ఈ మూవీలో లారెన్స్ తో జతకట్టిన తాప్సీ.. ఈ ప్రాజెక్ట్ కోసం తానెంతో కష్టపడ్డానని ఒకానొక సందర్భంలో చెప్పుకొచ్చింది కూడా! ఇంకో విషయం ఏమిటంటే.. ఇందులో నిత్యామీనన్ ఓ స్పెషల్‌ పాత్రలో కనిపించనుంది. ప్రస్తుతం ఈ మూవీ ఫస్ట్ లుక్ ని విడుదల చేసిన లారెన్స్.. ఈనెలాఖరులో ఆడియో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. అలాగే.. ఏప్రిల్ నెలలో విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : raghava lawrence  kanchana 2 movie updates  tapsee pannu  nitya menon  

Other Articles