దర్శకరత్న దాసరి నారాయణరావు, మెగా ఫ్యామిలీకి మధ్య గతకొద్ది కాలంగా కోల్డ్ వార్ నడుస్తోందనే విషయం తెలిసిందే. సమయం దొరికినప్పుడల్లా మెగా ఫ్యామిలీపై దాసరి పరోక్షంగా విమర్శలు కురిపిస్తూనే వుంటాడు. అలాంటి దాసరి మరోసారి మెగా ఫ్యామిలీపై పలు కామెంట్లు చేసాడు.
అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం నిన్న హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి దాసరి నారాయణ రావు ప్రత్యేక అతిథిగా విచ్చేసారు. ఈ సంధర్భంగా మెగా ఫ్యామిలీ గురించి ఎలాంటి కామెంట్లు చేయకుండా... బన్నీని పొగుడుతూనే పవన్ ను కూడా ఆకాశానికేత్తేసారు దాసరి.
ఈ కార్యక్రమంలో దాసరి మాట్లాడుతూ... ఈ కార్యక్రమానికి తాను కేవలం అల్లు రామలింగయ్య గారి కుటుంబం మీదున్న గౌరవంతోనే వచ్చానని అన్నారు. మీరు(అభిమానులు) సైలెంట్ గా వుంటే మాట్లాడుతా... మీరంతా ఫంక్షన్లకు వచ్చి, మీ అభిమానాన్ని చాటుతున్నారు. కానీ మీ హీరో గురించి, ఆ హీరో సినిమాల గురించి ఎవరైనా పెద్దలు మాట్లాడితే... అవి వినేటంతా ఓపిక లేకపోతే... ఫంక్షన్లకు మాలాంటి వాళ్లు రావడం వేస్ట్. గంగోత్రి సినిమా నుంచి అల్లు అర్జున్ ను తాను చూసానని దాసరి అన్నారు. ఆ తర్వాత బన్నీ తనకు తానుగా ఓ కొత్త స్టైల్ ను ఏర్పాటు చేసుకున్నాడు అని అన్నారు.
సినిమాల్లో వుండే నటీనటులకు ఓ స్టైల్ వుంటుంది. ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి వాళ్లకు ఓ స్టైయిల్ వుండేది. కానీ కొత్తగా పవన్ కళ్యాణ్ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టైయిల్ ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇవాళ్ల పవన్ కళ్యాణ్ స్టైయిల్ ను ఇపుడు వస్తున్న హీరోలంతా ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కానీ అల్లు అర్జున్ మరో స్టైయిల్ తో వచ్చాడు. ఇప్పుడు వస్తున్న హీరోలందరూ కూడా బన్నీ స్టైయిల్ ను కాపీ కొడుతున్నారు అంటూ కామెంట్లు చేసాడు.
ఆ తర్వాత దాసరి మాటలకు బన్నీ కౌంటర్ వేసినట్లుగా అనిపించింది. కౌంటర్‌గా బన్నీ మాత్రం మెగా ఫ్యాన్స్ ఆశీస్సుల వల్లే తాను ఈ వేదికపై వున్నానని అన్నాడు. మరి వీరి మధ్య కోల్డ్ వార్ నడుస్తుందో లేదో త్వరలోనే తెలియనుంది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more