Legend Movie | Balakrishna | Boyapati srinu

Balakrishna legend movie 365 days completed

Legend Movie 365days Completed, Legend Movie latest news, Legend Movie posters, Legend Movie songs, Legend Movie audio, Legend Movie trailers, Legend Movie

Balakrishna Legend Movie 365 days Completed: Nandamuri Balakrishna Block buster movie legend completes 365 days successfully. Director Boyapati srinu.

బాలయ్య లెజెండ్ సరికొత్త రికార్డ్

Posted: 03/28/2015 11:05 AM IST
Balakrishna legend movie 365 days completed

నందమూరి నటసింహం బాలకృష్ణ నట విశ్వరూపాన్ని మరోసారి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసి రికార్డులను తిరగరాస్తున్న చిత్రం ‘లెజెండ్‌’. వారాహి చలనచిత్రం సమర్పణలో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ చిత్రం మార్చి 28న విడుదలై..విజయవంతంగా 365 రోజులను పూర్తి చేసుకుంటుంది. ‘సింహా’ వంటి సూపర్‌ సక్సెస్‌ అనంతరం మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య నటించిన ‘లెజెండ్‌’ చిత్రం, ‘సింహా’ రికార్డులను తిరగ రాయడంతోపాటు.. బాలకృష్ణ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. భారీ బడ్టెట్‌తో తెరకెక్కిన ఈ మాస్‌ ఎంటర్‌టైనర్‌ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది.

మ్యూజిక్‌ మిస్సైల్‌ దేవిశ్రీప్రసాద్‌ బాణీలు, హీరోయిన్లు సొనల్‌ చౌహాన్‌ అందం, రాధికా ఆప్టే అభినయంతోపాటు.. ఫ్యామిలీ హీరో టర్న్‌డ్‌ విలన్‌ జగపతిబాబు ప్రతినాయకుడిగా ప్రదర్శించిన విలనిజం ‘లెజెండ్‌’ చిత్రానికి మెయిన్‌ హైలైట్‌గా నిలిచింది.

వీటన్నిటికంటే ముఖ్యంగా.. బాలకృష్ణ పాత్ర తీరుతెన్నుల్ని దర్శకుడు బోయపాటి తీర్చిదిద్దిన విధానం ధియేటర్‌లో ఆడియన్స్‌ చేత విజిల్స్‌ వేయించింది. అలాగే.. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీపడకుండా చిత్ర నిర్మాతలు రామ్‌ ఆచంట, గోపి ఆచంట, అనిల్‌ సుంకర మరియు సమర్పకులు సాయి కొర్రపాటి పాటించిన నిర్మాణ విలువలు ‘లెజెండ్‌’ చిత్ర విజయంలో కీలకపాత్ర పోషించాయనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

‘లెజెండ్‌’ చిత్రం ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లోనే కాకుండా.. ఓవర్సీస్‌లో కూడా తన సతా ్త చాటుకుంది. వారం రోజుల సినిమాలు ఆడతాయా అనుకునే ఈరోజుల్లో నటసింహా ఎక్స్‌ట్రార్డినరీ ఫెర్ఫామెన్స్‌తో ‘లెజెండ్‌’ 127సెంటర్స్‌లో 50 రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం 31 సెంటర్స్‌లో వందరోజులను పూర్తి చేసుకుంది. నిరాటంకంగా 200 రోజులను పూర్తి చేసుకోవడమే కాకుండా 50 కోట్ల రూపాయలను కలెక్ట్‌ చేసి 2014 బ్లాక్‌ బస్టర్‌ మూవీగా నిలిచింది. ఇలా వరుస రికార్డులను క్రియేట్‌ చేసుకుంటూ, తన రికార్డులను తనే తిరగరాసుకుంటూ దూసుకెళ్తున్న ‘లెజెండ్‌’ రీసెంట్‌గా 365 రోజులను దిగ్విజయంగా పూర్తి చేసుకుంటుంది. కడపజిల్లా ప్రొద్దుటూరులోని ఆర్వేటి థియేట‌ర్‌లో 56రోజులు, అర్చన థియేటర్‌లో 310 రోజు(సింగిల్‌ షిఫ్ట్‌ 4 ఆటలు)ల‌ను పూర్తి చేసుకుంటుంది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మినీ శివ(డైరెక్ట్‌గా 4 ఆటలు)లతో 365రోజులను పూర్తి చేసుకుంటుంది. ప్రొద్దుటూరులో 365రోజులు పూర్తి చేసుకోవడమే కాకుండా కడపజిల్లాలో అత్యధిక రోజులు ప్రదర్శింపబడుతున్న తొలి తెలుగు చిత్రంగా టాలీవుడ్‌లో లెజెండ్ స‌రికొత్త రికార్డు క్రియేట్‌ చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Balakrishna  Legend Movie  365days Completed  

Other Articles