స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘s/o సత్యమూర్తి’ ఏప్రిల్ 9న అత్యధిక ధియోటర్స్ లొ విడుదలవుతుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో ఎస్.రాధాకృష్ణ ‘s/o సత్యమూర్తి’ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. అల్లు అర్జున్, సమంత, నిత్యామీనన్, అదాశర్మ హీరోయిన్స్. కన్నడ స్టార్ ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, స్నేహ కీలక పాత్రలు పోషించారు. ఇతర పాత్రల్లో సింధుతులాని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, రావ్ రమేష్ నటిస్తున్నారు.ఇటీవలే మ్యూజిక్ డెవిల్ దేవిశ్రీప్రసాద్ సంగీతమందించిన ఆడియో సూపర్‌హిట్ అయ్యింది. ఈ సక్సస్ ని అభిమానులందరితో పంచుకోవటానికి ఏప్రిల్ 6న విజయవాడలో ‘s/o సత్యమూర్తి’ యూనిట్ అందరూ హజరయ్యి గ్రాండ్ గా ఆడియో సక్సస్మీట్ ని నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత ఎస్.రాధాకృష్ణ మాట్లాడుతూ” స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ ల కాంబినేషన్ తో మా బ్యానర్లో చిత్రీకరించిన ‘s/o సత్యమూర్తి’ ఏప్రిల్ 9న గ్రాండ్ గా విడుదలవుతుంది. దేవిశ్రీప్రసాద్ అందించిన అద్భుతమైన పాటలు ఇప్పటికే సూపర్‌హిట్ అయ్యాయి. అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. దేవి అందించిన ఆడియోకి తెలుగు ప్రేక్షకులు ఇంతటి బ్రహ్మరథం పట్టినందుకు ఏప్రిల్ 6న విజయవాడలో గ్రాండ్ ఆడియో సక్సెస్‌మీట్ ని నిర్వహిస్తున్నాము. అభిమానుల సమక్షంలో జరిగే ఈ కార్యక్రమాలకి చిత్ర యూనిట్ అంతా హజరవుతారు.తెలుగు ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రాన్ని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించారు. ‘మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి. కష్టాల్లో వున్నప్పుడు విలువలు మాట్లాడకూడదు’ అనే మాటతో విలువలే ఆస్తి అని ఎంతో చక్కగా దర్శకుడు చెప్పారు. అంతకుమించి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పెర్ ఫార్మెన్స్ మరియు లక్ ఈ సినిమాకు హైలైట్ కానుంది. ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, స్నేహ పాత్రలు సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్, ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది. అని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more