పవన్ కళ్యాణ్ నటించిన ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ చిత్రంలో ‘జరమొచ్చింది...’ అంటూ ఓ ఐటెం సాంగ్ లో భారీ అందాల ప్రదర్శన చేసిన హాట్ భామ స్కార్లెట్ విల్సన్ గుర్తుంది కదా! ఆ అమ్మడు ప్రభాస్ కు చాలా సిగ్గు అని చెబుతోంది. ప్రభాస్ చాలా సిగ్గుపడతాడని చెబుతోంది. ఇంతకీ ఏం జరిగిందని అనుకుంటున్నారా?
ప్రభాస్ నటిస్తున్న ‘బాహుబలి’ చిత్రం మొదటి భాగం షూటింగ్ ఇటీవలే పూర్తయ్యిన విషయం అందరికి తెలిసిందే. ఈ షూటింగ్ చివర్లో ప్రభాస్, స్కార్లెట్ విల్సన్, నోరా ఫతేహి, స్నేహా ఉపాధ్యాయలతో ఓ హాట్ ఐటెం సాంగ్ ను చిత్రీకరించారు. ఈ షూటింగ్ సమయంలో ప్రభాస్ ను స్కార్లెట్ బాగా దగ్గరుండి గమనించినట్లుగా వుంది. అందుకే ప్రభాస్ గురించి ఈ అమ్మడు పలు విషయాలను వెల్లడించింది.
ప్రభాస్ తో మాట్లాడటానికే తనకు 3 రోజుల సమయం పట్టిందని, ఎందుకంటే అతడు చాలా రిజర్వుడుగా వుంటాడని, పైగా ప్రభాస్ చాలా భోళామనిషి అంటూ ప్రశంసించింది. అతడితో కలిసి పనిచేయడం తనకు ఇదే తొలిసారి అని, ఈ సాంగ్ షూట్ చేయడానికి ఎనిమిది రోజుల పట్టిందని చెప్పుకొచ్చింది. అయితే షూటింగ్ చివరి రోజు ఓ సన్నీవేశం కోసం దాదాపు 20 టేకుల వరకు తీసుకున్నా కూడా ఎవరూ కూడా తనపై ఎలాంటి అసహానం అవడం, ఎలాంటి ఫిర్యాదులు చేయడం వంటివి చేయలేదని స్కార్లెట్ విల్సన్ చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో పలు స్టార్ హీరోల చిత్రాల్లో హాట్ హాట్ సాంగులలో నటిస్తూ దూసుకుపోతుంది. ఇలాగే కొనసాగితే త్వరలోనే ముమైత్ ఖాన్ వలే ఈ అమ్మడు కూడా ఏదో ఒక సినిమాలో హాట్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఆశ్చర్యపోనవసరం లేదు. చూద్దాం.. మరి భవిష్యత్తులో ఏం జరుగనుందో.
Video courtesy: Puri Jagannadh
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more