Actor Naresh | Tweets | AP Film Chamber

Actor naresh serious on ap film chamber

Naresh Angry on AP Film Chamber, Naresh comments on AP Film Chamber, Naresh serious on AP Film Chamber, Actor Naresh latest news, Actor Naresh fires on APFC, Actor Naresh news, Actor Naresh

Actor Naresh Serious on AP Film Chamber: Senior Actor Naresh serious on AP Film Chamber. actor naresh official twitter page, naresh tweets on ap film chamber.

చందమామ నరేష్ కు కోపమొచ్చింది!

Posted: 04/14/2015 01:59 PM IST
Actor naresh serious on ap film chamber

సీనియర్ నటుడు నరేష్ ఏపీ ఫిలింఛాంబర్ పై తన ఆగ్రహం వ్యక్తం చేసారు. అరే.. జాతీయ అవార్డు వచ్చిన కూడా ఎవరు పట్టించుకోవడం లేదని నరేష్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. నరేష్, మంచు లక్ష్మీ, ఆమని తదితరులు ప్రధాన పాత్రలలో నటించిన ‘చందమామ కథలు’ చిత్రానికి ఇటీవలే జాతీయ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ప్రతీ సంవత్సరం జాతీయ అవార్డును సొంతం చేసుకున్న ఆ తెలుగు సినిమా యూనిట్ కు ఏపీ ఫిలిం ఛాంబర్ వారు అభినందించడం జరుగుతుంది.

కానీ ఈసారి మాత్రం అలా జరగలేదట. ‘చందమామ కథలు’ చిత్రానికి జాతీయ అవార్డు వచ్చిన ఇన్ని రోజులకు కూడా ఇంకా ఫిలింఛాంబర్ నుంచి చిత్ర యూనిట్ కు ఎలాంటి అభినందనలు రాలేవని, ఇది చాలా దారుణం అని నరేష్ తన సోషల్ మీడియా ట్విట్టర్ అకౌంట్ ద్వారా చెప్పుకొచ్చాడు.

నిజానికి తెలుగులో ఏ సినిమాకైనా అవార్డులు వచ్చినప్పుడు తోటి కళాకారుల నుంచి అభినందనలు రావడం సహజమే. అలాంటి నటీనటుల సంఘం నుంచి ఖచ్చితంగా ఇలాంటి ప్రోత్సాహకరమైన అభినందనలు రావాల్సిందే. కానీ ‘చందమామ కథలు’ చిత్ర యూనిట్ కు మరి ఇంతవరకు ఏపీ ఫిలింఛాంబర్ వారు ఎందుకు అభినందనలు తెలియజేయలేదో తెలియడం లేదు.

మరి ఈ విషయంపై ఏపీ ఫిలింఛాంబర్ వారు ఎలా స్పందిస్తారో... మరి అభినందనలు తెలియజేస్తారా లేక ఈ విషయాన్ని ఇలాగే వదిలేస్తారా అనే విషయం త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actor Naresh  Tweets  AP Film Chamber  

Other Articles